#Chiranjeevi #PawanKalyan #Megastar #Janasena
సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి జనసేనలో చేరబోతున్నారా ? తమ్ముడి పార్టీని గట్టెక్కించేందుకు తానే స్వయంగా బరిలోకి దిగుతున్నారా ? పవన్‌తో చేయి కలిపి వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేనను మార్చేందుకు నడుం బిగించారా ? పార్టీ బలోపేతానికి సంబంధించిన విషయాలపై చిరు- పవన్ చర్చించుకున్నారా ? అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే అవుననే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే జనసేన పార్టీతో చేయి కలిపి పవన్‌తో పనిచేయబోతున్నారని నాదెండ్ల వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, తాను ముగ్గురం కలిసి మాట్లాడుతున్న సమయంలో.. ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా, ఎందుకు ఖాళీగా ఉంటున్నావు, రెండు మూడేళ్ల వరకు సినిమాలు చేసుకోవచ్చు, మూవీస్‌ను వదులుకోవద్దని పవన్‌కు చిరు చెప్పారని నాదెండ్ల అన్నారు. తమ్ముడు పవన్‌కు రాజకీయ ప్రస్థానంలో అండగా ఉంటానని చిరు చెప్పిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ సమావేశంలో వెల్లడించడంతో మెగా అభిమానులు కేకలు పెట్టారు. మెగాస్టార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సినిమాలకు రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 సినిమా తీసిన చిరు.. పాలిటిక్స్‌ను అస్సలు పట్టించుకోలేదు. 2019లో ఏపీలో వైసీపీ అధికారలోకి వచ్చాక జగన్‌ను, కరోనా టైంలో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వచ్చారు. ఇదేక్రమంలో కొన్ని అంతర్గత మీటింగ్‌లో రాజకీయాలపై ఆసక్తిగా మాట్లాడారన్న గుసగుసలు వినిపించాయి. ఇటీవలే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సైతం చిరంజీవిని కలిసినా, ఎవరూ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని భావించలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా తిరుపతిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్.. చిరంజీవి రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందా అన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న చిరంజీవి..ఆపార్టీకి అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. కీలక సమావేశాల్లో అస్సలు పాల్గొనడం లేదు. అంతేగాక ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళం, మోహన్ రాజ్, లూసిఫర్ రిమేక్‌కు కమిట్ అయ్యారు. ఈ సినిమాలన్నీ పూర్తి కావాలంటే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కనీసం మూడేళ్లు పడుతోంది. మరి ఈ మూడేళ్లలో పవన్‌తో చిరంజీవి ఏవిధంగా టైం తీసుకొని జనసేన బలోపేతానికి కృషి చేస్తారన్నది క్వశ్చన్ మార్క్‌గా మారింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలున్న తరుణంలో బీజేపీ, జనసేన పొత్తుకు హైప్ తీసుకురావడానికే చిరంజీవి పేరును తెరపైకి తెచ్చారా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో తిరుగుతోంది.
మరి నాదెండ్ల చెప్పిన ప్రకారం చిరంజీవి ఏపీలో పాలిటిక్స్‌లో కీ రోల్ పోషిస్తారా లేకుంటే మళ్లీ సినిమాలతోనే బిజీగా గడుపుతారా అన్నది కాలమే నిర్ణయిచునుంది.
Please Share this article
Related:
Tagged with:
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్‌ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
Read More From This Category