#ThalapathyVijay #Master
తమిళ నటుడు విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కథానాయకుడిగా విజయ్, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిలు పోటాపోటీగా నటించారు. కాగా, జనవరి 29వ తేదీ నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
విజయ్ నటించిన మాస్టర్ చిత్రాన్ని తమ ఓటీటీలో విడుదల చేయడం ఆనందంగా ఉందని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ విజయ్ సుబ్రమణియమ్ తెలిపారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘మాస్టర్’ ఒకటని, అలాంటి చిత్రాన్ని ప్రైమ్ చందాదారుల కోసం తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. జాన్-భవానీల మధ్య పోరును థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన అభిమానులు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా మరోసారి ఈ యాక్షన్ డ్రామాను చూసి ఆస్వాదిస్తారని నటుడు విజయ్ అన్నారు. ప్రైమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులకు ఈ చిత్రం మరింత చేరువ అవుతుందని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category