#Chiranjeevi #Megastarchiranjeevi #Vedhalam #Vedhalam #Acharya
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అయితే సెట్స్ పై ఉన్న సినిమా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 9 నుంచి మొదలైంది. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ మాత్రం సెట్ కు రాలేదు. సోనూ సూద్, తణికెళ్ల భరణి లాంటి నటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు శివ. ఇదిలా ఉంటే చిరు ఎప్పుడు వస్తాడనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. డిసెంబర్ 5 నుంచి ఈయన వస్తాడనే వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసిన వాళ్లు కూడా లేరు. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం డిసెంబర్ 5 నుంచి ఆచార్య సెట్ కు వస్తానని చెప్పింది. దాంతో అప్పట్నుంచే చిరంజీవి కూడా వస్తాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇలా ఉండగానే మరో సినిమాను కూడా పట్టాలెక్కించేసాడు చిరంజీవి. ఈయన లేకుండానే వేదాళం రీమేక్ మొదలైపోయింది. ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా కథ ప్రకారం కలకత్తాలో జరుగుతుంది. అక్కడ ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజావి కనిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లోనే మేజర్ షెడ్యూల్ ఉండబోతుంది. ఈ సినిమా కథను తెలుగు ఆడియన్స్ మనసుకు నచ్చేలా మూడేళ్లుగా మారుస్తూనే ఉన్నాడు మెహర్ రమేష్. చివరికి చిరు మెప్పు పొందాడు.
అయితే ఇప్పుడు చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు మెహర్. అయితే ముందు ఆచార్య పూర్తవ్వాలి.. ఆ తర్వాత వేదాళం రీమేక్ వైపు చూస్తాడు చిరంజీవి. మరి అప్పటి వరకు కూడా మెహర్ మిగిలిన పార్ట్ పూర్తి చేస్తాడా అనేది చూడాలి. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శివ తెరకెక్కించాడు. 2015లో విడుదలైన వేదాళం తమిళంలో సూపర్ హిట్ అయింది. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. తెలుగులో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
Please Share this article
Related:
Tagged with:
అల్లరి నరేష్ రీమిక్స్ వీడియో సాంగ్ అదుర్స్
ఈ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది
డే అండ్ నైట్ షూట్స్ లో చరణ్
‘సురేష్ ప్రొడక్షన్స్’ నుండి మరో రీమేక్ సినిమా
మెగాస్టార్ ‘లూసిఫర్’ తొలిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
రోజాపై విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
రష్మిక మందన ‘పొగరు’ విడుదల తేదీ వచ్చేసింది
చిరు153వ చిత్రం షూటింగ్ ప్రారంభం
తల్లి పాత్రలకు కూడా సై అంటున్న శృతి హాసన్
ఎఫ్3లో స్పెషల్ రోల్ లో సుప్రీం హీరో
‘లూసీఫర్’ సినిమా కు సంగీత దర్శకుడి గా థమన్
డిజిటల్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించిన మాస్టర్ నిర్మాత
ఆచార్య' మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
ఏమాత్రం తగ్గని ‘రెడ్ మూవీ జోరు
Read More From This Category