మన హీరోలంతా ఈమధ్య మరింత హాండ్సమ్ గా కనిపిస్తున్నారు. చూస్తుంటే వీళ్లంతా రొమాంటిక్ హీరోలుగా స్టాంపేసే ప్రయత్నం చేస్తున్నట్టనిపిస్తోంది. ఇందులో భాగంగానే న్యూలుక్కులో కిక్కిచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరో ఎవరు ? మమమ్మాస్ అంటూ మాస్ రాగం పాడిన మన హీరోలంతా రూటు మారుస్తున్నారు. మాస్ మసాలాలు వడ్డిస్తూనే కొంచెం గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య మన హీరోల వేషభాషలు చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతోంది. రఫ్ అండ్ ఠఫ్ గా రఫ్ఫాడించడమే కాదు, క్లాస్ లుక్కులో స్టైలిష్ కిక్కివ్వడం పై ఫోకస్ పెడ్తున్నారు.
ఎంత మాస్ ఫాలోయింగ్ ఉన్నా, అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకుంటే అందులో ఉండే కిక్కే వేరు. అందుకే మన హీరోలంతా ఇప్పుడు డ్రీమ్ బాయ్స్ గా స్టాంపేసే ట్రయల్స్ లో ఉన్నారు. ఫైటింగులూ, పంచ్ డైలాగుల్తో పటాస్ అనిపిస్తూనే మరోవైపు, స్మార్ట్ అండ్ క్యూట్ గా హీట్ పుట్టించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.ఈమధ్య రిలీజైన సినిమాలు చూసినా, అప్ కమింగ్ సినిమాల ట్రైలర్స్ చూసినా హీరోల స్ట్రాటజీలో తేడా క్లియర్ గా కనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు కాస్త రొమాంటిక్ డోసు పెంచేస్తూ గ్రేస్ చూపిస్తున్నారు. ముఖ్యంగా లవ్ ఎపిసోడ్స్ లో, పాటల్లో చాలా సాఫ్ట్ లుక్ తో దర్శనమిస్తున్నారు.
ఒకప్పుడు సోగ్గాడిగా శోభన్ బాబు అదరగొట్టేశాడు. ఆ తర్వాత ఆప్లేస్ ను అక్కినేని నాగార్జున రీప్లేస్ చేశాడు. గ్రీకువీరుడిగా యూత్ ఆడియన్స్ హార్ట్స్ కొల్లగొట్టి మన్మథుడిగా హంగామా చేశాడు. కానీ నెక్ట్స్ ఆప్లేస్ ను ఎవరు ఆక్యుపై చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికైతే ఆ డ్రీమ్ బోయ్ చైర్ ఎప్పుటికప్పుడు చేతులు మారిపోతోంది.
గోవిందుడు అందరివాడేలే సినిమాలో రాంచరణ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనేది ట్రైలర్స్ లో క్లియర్ గా తెల్సిపోతోంది. ఇప్పటిదాకా మాస్ ప్రేక్షకుల్నే టార్గెట్ చేసిన ఈ మగధీరుడు, అలా సింగిల్ జానర్ ఆడియన్స్ తోనే వర్కౌట్ కాదనుకున్నట్టున్నాడు. అందుకే ఈసారి క్లాస్ తరగతి పై ఫోకస్ పెట్టాడు. అంతకుముందు ఆరెంజ్ వంటి లవ్ స్టోరీతో రొమాంటిక్ టచ్ ఇచ్చినా సక్సెస్ కాకపోవడంతో ఈసారి రూటుమార్చి ఫ్యామిలీప్యాక్ తో ఆ ఫీట్ ను క్యాచ్ చేయాలనుకుంటున్నాడు.
ఇలా రాంచరణ్ ,అల్లు అర్జున్ ఒక్కరే కాదు . ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా రొమాంటిక్ హీరో బెర్తుకోసం ఎవరికి చేతనైనంత రేంజ్ లో వాళ్లు ట్రయల్స్ వేస్తూనే ఉన్నా, ఆ చైర్ కోసం ప్రధానపోటీ మాత్రం మహేష్ బాబు, ప్రభాస్ ల మధ్యే జరుగుతోంది. ముఖ్యంగా దూకుడు, ఆగడు వంటి మాస్ స్టోరీలతో పాటు సీతమ్మవాకిట్లో, వన్ వంటి ప్రయోగాలతో డ్రీమ్ బాయ్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు మహేష్. ఇక రొమాంటిక్ హీరో రేస్ లో మహేష్ కు గట్టిపోటీనిస్తున్నాడు ఆరడుగుల అందగాడు ప్రభాస్. తన ఫిజిక్ మాస్ స్టోరీస్ కే సూటయ్యేటట్టున్నా, అతగాడి కటౌట్ కు ఫ్లాటైపోయిన యూత్ ఫాలోయింగ్ కూడా తక్కువేంలేదు. ఏదైతేనేం ఇప్పటి హీరోల్లో పర్ ఫెక్ట్ రొమాంటిక్ హీరో ఎవరంటే ఠక్కున చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే మన హీరోలంతా పూర్తిస్థాయి రొమాంటిక్ హీరోగా ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. -
Please Share this article
Related:
Tagged with: teluguromanticheroplace
ఊరంతా ఏమనుకుంటున్నారు?- శ్రీనివాస్ అవసరాల
చరణ్ చేయకపోతే నేనే చేస్తా - వరుణ్ తేజ్
అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టా
స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా-లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
సంపూర్నేష్బాబు ఇంటర్వ్యూ
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ జోడి బాగాలేదా ? డాలీ ఇంటర్వ్యూ
ఎన్ని సినిమాలైనా ఆడతాయి-శర్వానంద్ ముచ్చట్లు
ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ -చిరంజీవి ఇంటర్వ్యూ హైలైట్స్
ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే
అదే జనాలను కూర్చోపెడుతుంది-చరణ్ ఇంటర్వ్యూ
విలన్గా నటించాలనే నా కోరిక తీరిపోయింది
నా దగ్గర పదేండ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయి-పూరీ ఇంటర్వ్యూ
త్వరలోనే నిర్మాతగా
మెచ్చ్యూరిటీ పెరిగిందిరామ్ ఇంటర్వ్యూ
డేంజర్ నుంచి బయటపడ్డా-నాని
Read More From This Category