#SooraraiPottruJoinsOscar #SOORARIPOTTRU #SooraraiPottruJoinsOSCARS #Suriya
సూర్య నటించిన తమిళ చిత్రం సూరారై పొట్రు.. ఈ ఏడాది ఆస్కార్‌కు పోటీపడనున్నది. సుధా కొంగర డైరక్ట్ చేసిన ఈ మూవీ ఆస్కార్ రేసులో ఉన్నది. జనరల్ క్యాటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు పోటీపడుతున్నది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరక్టర్ తో పాటు మరికొన్ని కేటగిరీల్లో ఈ సినిమా పోటీపడనున్నది. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించారు. సూర్య కీలక పాత్ర పోషించారు. అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్ దీంట్లో నటించారు. ఈ సినిమా రెవెన్యూ పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. 2020కి గానూ ఓటీటీల్లో అత్యధిక వీక్షణలో దేశంలోనే టాప్ 2లో నిలిచింది.
సూరారై పొట్రు సినిమా ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయినట్లు ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కోసం.. ఆస్కార్స్‌లో జనరల్ క్యాటగిరీలో పోటీపడనున్నట్లు పాండియన్ తెలిపారు. అకాడమీలో తమ సినిమా స్క్రీనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ దక్కిందన్నాడు. గత ఏడాది లాక్డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్లు బంద్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీ ఫార్మాట్లో సురారై పొట్రును రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఆకాశం నీ హద్దురా సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్స్ వేడుక జరగనున్నది.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category