హృదయ కాలేయం' నుంచి నాకు ప్రతి రోజూ పండగే. చిన్న నటుడినైనా నాకు ఈ చిత్రంతో ప్రేక్షకులు, మీడియా మంచి గుర్తింపునిచ్చింది. ఎంతో మంది సినిమా పెద్దలు నాకు అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు' అని సంపూర్నేష్‌బాబు అన్నారు. 'హృదయ కాలేయం' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన సంపూర్నేష్‌బాబు పుట్టిన రోజు 'నేడు (మంగళవారంనటుడిగా నాలుగవ పుట్టినరోజు… )
మారుమూల గ్రామంలో పుట్టిన నేను సినిమా ఇండస్ట్రీలో విజయవంతంగా నాలుగవ సంవత్సరాన్ని పూర్తిచేసుకుంటున్నాను. నటుడిగా నా నాలుగవ పుట్టినరోజు ఇది. నేను ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకాలేదు. చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత బర్త్‌డేను జరుపుకోవడం ఆనందంగా ఉంది.కొబ్బరిమట్టను ఆదరిస్తారని…చిన్న నటుడైన నేను హృదయకాలేయం విజయం తర్వాత సినీ పెద్దలు ఆశీర్వదించి, దీవించి వాళ్ల సినిమాల్లో అవకాశాలు కల్పించారు. వారందరికీ నా ధన్యవాదాలు. ‘హృదయ కాలేయం’ను ఆదరించినట్టే ‘కొబ్బరిమట్ట’ సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీలో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటున్నాను.కడుపుబ్బ నవ్వుకుంటారు…హృదయ కాలేయం తర్వాత ప్రతిరోజు నాకు గొప్ప దినం. దీని తర్వాత కొన్ని సినిమాలు చేశాను. కానీ వాటన్నింటికంటే కొబ్బరిమట్ట సినిమాతో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు. ఈ సినిమా ఆలస్యమైనప్పటికీ మంచి హిట్నిచ్చే ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా.అద్భుతమైన స్పందన…హృదయ కాలేయంకంటే వందరెట్లు ఎంజాయ్ చేసే చిత్రం ‘కొబ్బరిమట్ట’.ఇప్పటికే రిలీజైన డైలాగ్ ట్రైలర్, సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సాంగ్ బాగా పాపులర్ అయింది. వీటితో సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి.కుటుంబ కథా చిత్రం…సినిమాలో స్పూఫ్‌లు లేవు. పూర్తిగా కుటుంబ కథా చిత్రం కొబ్బరిమట్ట. ఏడుగురు భార్యలు, పది, పన్నెండు మంది పిల్లలు, ముప్పై, నలభై మంది మనవళ్లు, మనవరాళ్లతో సినిమాలో పెద్ద కుటుంబం ఉంటుంది.ఆగస్టులో రెండు సినిమాలు ప్రారంభం…సోలో హీరోగా నేను చేయబోయే రెండు సినిమాలు ఆగస్టులో ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికైతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేయడం లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ చేస్తా.మగవాళ్ల గొప్పతనం చెప్పే డైలాగ్…సినిమాల్లో మగవాళ్ల గొప్పతనాన్ని చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. మూడు నిమిషాల డైలాగ్ ఇది. అందరినీ నవ్విస్తూ ఆకట్టుకుంటుంది ఈ డైలాగ్. ఇలాగే పలు డైలాగ్‌లు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి.గ్యాప్ వస్తే మా ఊరికి వెళ్తా…సినిమా షూటింగ్‌కు మూడు, నాలుగు రోజుల గ్యాప్ వస్తే చాలు మా ఊరికి వెళ్లిపోతాను. సిద్ధిపేట్ దగ్గర ఉన్న పల్లెటూరు మిట్టపల్లి నా స్వస్థలం. అక్కడ కుటుంబం, స్నేహితులతో హాయిగా గడిపి తిరిగొస్తాను. ఇక చిత్ర పరిశ్రమలో 10 శాతం రాణిస్తే చాలనుకుంటే వందశాతం రాణించాను. నాకు చిన్న చిన్న కలలున్నాయి. అవికూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను.
Please Share this article
Related:
Tagged with:
బిజీగా ఉన్న అల్లు బ్రదర్
నిందితుల ఎన్కౌంటర్ ఫై తెలుగు చిత్రసీమ స్పందన
దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై నాగ్, ఎన్టీఆర్ స్పందన
ఈ అమ్మడు చాలా హాట్ గురూ
శేఖర్ కమ్ముల రూట్ మార్చాడా?
అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు
కమిట్ అయ్యాను కాబట్టి వదిలిపెట్టను: రష్మిక
విజిల్ రిలీజ్ ఆపేసిన కోర్టు
సెక్సీయెస్ట్ ఏషియన్ మేల్ 2019 గా హ్రితిక్
అమితాబ్ ని వెంటాడుతున్న అలనాటి వ్యాఖ్యలు
రూట్ మార్చిన నాని
షకీలా సినిమాకు సెన్సార్ సమస్యలు
దూసుకెళ్తున్న సరిలేరు సాంగ్
హిందీ కోసం తెలుగును వాడుకొనని అంటుంది
Read More From This Category