#TrivikramSrinivas #PoojaHegde
కొందరు దర్శకులు కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలే లేకుండా అన్ని రాష్ట్రాల నుంచి హీరోయిన్లను రంగంలో దింపుతారు. ముఖ్యంగా ఆల్రెడీ చేసిన హీరోయిన్లతో కాకుండా వేరేవాళ్లను తీసుకునేందుకే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అంతే! తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ కాకుండా చూసుకుంటాడు. కానీ ఓ బేబీ బ్యూటీ సమంతకు మాత్రం మూడు అవకాశాలిచ్చాడు.
తర్వాత గోవా బ్యూటీ ఇలియానా త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా రెండింటితోనే సరిపెట్టుకుంది. అయితే తాజాగా పూజాకు మరోసారి త్రివిక్రమ్ సినిమాలో మెరిసే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ఈ డైరెక్టర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కాగా పూజా ఇప్పటికే త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్', అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తోంది.
Please Share this article
Related:
Tagged with:
'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు' - కోమలి
నిహారికకు సేవలు చేస్తున్న చైతన్య
ఓటీటీలో నాంది
సిటీ లో విల్లాను కొనుగోలు చేసిన అనిల్ రావిపూడి
జాతి రత్నాలు డైరెక్టర్ తో హీరో రామ్
2 డేస్ కలెక్షన్ రిపోర్ట్: స్టడీగా వెళ్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’
రెండో పెళ్లిపై స్పందించిన మంచు మనోజ్
గోపీచంద్ పక్కా కమర్షియల్ షూట్ ప్రారంభం
సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరో తెలుసా ?
ఇన్స్టాగ్రామ్ లో రౌడీ హీరో రికార్డు
‘జాతి రత్నాలు’ కోసం వస్తున్న రౌడీ రత్నం
బంపర్ ఆఫర్ 2ను అనౌన్స్ చేసిన సాయిరామ్ శంకర్’
‘అరణ్య’ నుంచి అడవి గీతం
మహేశ్ బాబు తో మళ్ళీ జోడీ కట్టనున్న తమన్నా
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
రెండో పెళ్లి చేసుకుంటున్న మంచు మనోజ్
Read More From This Category