ఈ 'మజ్ను' ప్రత్యేకత ఏంటి?- పాత 'మజ్ను' సినిమా పేరు వింటే ట్రాజెడీ ప్రేమ కథ గుర్తొస్తుంది. ఇందులో కోల్పోయిన ప్రేమని కూడా మళ్లీ హీరో సాధిస్తాడు. ఈ చిత్రం విడుదలయ్యాక 'మజ్ను' అనే పదానికి అర్థమే మారిపోతుంది. అందుకోసమే ఈ టైటిల్ పెట్టాం. ప్రేమ పట్ల పాజిటివ్‌గా ఉండమని చెప్పే చిత్రమిది. అంతేకాకుండా ఒకప్పుడు ప్రేమికులు లవ్ లెటర్స్ రాసుకునేవారు. ఇప్పుడు మెయిల్స్, ఫోన్స్, సోషల్ మీడియా రావడంతో లవ్ లెటర్ అనే కాన్సెప్టే లేకుండా పోయింది. ఎమోషన్స్ అన్నీ పొల్యూట్ అయ్యాయి. ట్రూ లవ్ కోసం, ఫ్రెష్ ఫీలింగ్ తీసుకు రావడం కోసం ఈ చిత్రంలో లవ్ లెటర్ కాన్సెప్ట్ పెట్టాం.రోజులు మారినప్పటికీ కొందరిలో ఆ ఇన్నోసెన్స్ ఇంకా ఉందని తెలిపేలా ఉండటమే ఈ సినిమా ప్రత్యేకత.
ఈ ప్రాజెక్ట్ ఎలా పట్టాలెక్కింది?- విరించి వర్మ 'ఉయ్యాల జంపాల' కథని ముందు నాకే చెప్పాడు. ఆ కథకు కొత్త కుర్రాళ్లైతే బాగుంటుందని నేను చేయలేదు. విరించి రూపొందించిన 'నిన్నటి వెన్నెల' లఘు చిత్రం చూశా. క్యూట్‌గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అప్పట్నుంచి విరించి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. జెమినీ కిరణ్ నాతో చాలా రోజులుగా సినిమా చేయాలనుకుంటున్నారు. ఓ రోజు విరించి వర్మను తీసుకుని నావద్దకు వచ్చారు. విరించి వస్తున్నాడని తెలిసినప్పుడే సినిమా కచ్చితంగా చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. కథ చెప్పేటప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యా. మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశా. విరించి నాకు మంచి ఫ్రెండ్. మంచి వ్యక్తి కూడా. ఆ మంచితనం సినిమాలోనూ కనిపిస్తుంది.
ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీనా?- ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదని, అవునని చెప్పలేను. మరి ఎలా ఉంటుందంటే మాత్రం వెండితెరపై చూడాల్సిందేనని చెబుతాను. ఇందులో నేను ఆదిత్య అనే అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. రాజమౌళి వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేస్తుంటాను. కానీ సినిమా అంతా నా ప్రేమ కథ చుట్టూతే తిరుగుతుంటుంది. సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరి రియల్ లైఫ్‌లోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. లవ్ ఎంటర్టైనర్ చిత్రమైనప్పటికీ అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతుంది. గోపీసుందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. నిర్మాతలు రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.మీ సినిమాల తీరు చూస్తుంటే కథల ఎంపికలో అతి జాగ్రత్త పడుతున్నట్లుంది?- ఒకసారి చేసిన కథను నేను రిపీట్ చేయను. సాధ్యమైనంత వరకు కొత్తగా చేసేందుకు ఇష్టపడతాను. అందుకే నా చిత్రాలు వైవిధ్యంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ నేను చేసేది ఏదీ ప్రయోగాత్మక చిత్రం కాదు. కథ విన్నప్పుడు ఒక ఆడియెన్‌గా ఎంజారు చేశానంటే ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని బలంగా నమ్ముతా. అయితే గత చిత్రాలు కూడా అలా నమ్మి చేసినవే. పైగా ఇటీవల వచ్చిన 'భలే భలే మగాడివోరు', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్మన్' చిత్రాల కంటే 'పైసా', 'జెండా పై కపిరాజు' చిత్రాలకు ఫిజికల్‌గా బాగా స్ట్రయిన్ అయ్యాను. కానీ అవి ఆడలేదు. ఇటీవల విజయం సాధించిన చిత్రాలను ఆడుతూ పాడుతూ చేశాను. అవి పెద్ద హిట్ అయ్యాయి. దీంతో నేనేదో సెలక్టీవ్‌గా చేసుకుంటున్నానని అంటున్నారు. నా దృష్టిలో అన్నీ ఒకే ఫీలింగ్‌తోనే చేశా. నాకు నచ్చిన, దగ్గరగా అనిపించిన చిత్రాలే చేస్తున్నా. అలా కాకుండా ఈ పాత్ర నాకు సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం కోసం నిర్మాతలను, వందల మంది టీమ్‌ను రిస్క్‌లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు.
సినిమాలు, కథలను బట్టి ఆర్టిస్టులకు పరిధులేమైనా ఉంటాయా?- అలా ఏం ఉండదు. అసలు ఆర్టిస్టు అనేవాడికే లిమిటేషన్ ఉండదు. రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే బెస్ట్ అవుట్‌పుట్ రాదు. కొంతమంది హీరోలు లవ్ స్టోరీలు, కామెడీ, యాక్షన్... ఇలా ఒకే జోనర్‌కి పరిమితమవ్వడం వల్ల ఒక స్టేజ్‌కి వచ్చాక బోరింగ్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను చూడరు. దీంతో కెరీర్ సందిగ్ధంలో పడుతుంది. లక్కీగా నేను ఆ తరహా డేంజర్ నుంచి బయటపడ్డాను. నేను అన్ని రకాల చిత్రాలు చేయగలననే ఫీలింగ్ అందరిలోకి బాగా వెళ్ళింది.
నెక్ట్స్ ప్రాజెక్టులు?ప్రస్తుతం 'నేను లోకల్' చిత్రంలో నటిస్తున్నా. ఇది పూర్తి మాస్ ఫిల్మ్. క్రిస్మస్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత డి.వి.వి.దానయ్య బ్యానర్లో ఉంటుంది. శ్రీనివాస్ అవసరాలతో వచ్చే ఏడాది ఉంటుంది. మంచి కథ వస్తే తెలుగు, తమిళ బైలింగ్వల్ చేయడానికి రెడీగా ఉన్నా
Please Share this article
Related:
Tagged with: nanimajnunani interview
సుడిగాలి సుదీర్ ను బుక్ చేసిన యాంకర్
13 ఏళ్ల తర్వాత చిరుతో మణిశర్మ
అనసూయ వద్దంటే రష్మీకి దక్కింది
ఆల టీజర్ విడుదల వాయిదా
నూర్ భాయ్ ఇక లేడు, బాధలో మెగా హీరోలు
రజిని గురించి ఆసక్తికర విషయాన్నీ చెప్పాడు
బాలకృష్ణ సరసన కీర్తి
శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ
ఆలస్యంగా ఎంకౌంటర్ పై స్పందించిన నయన్
వెంకీ మామ ట్రైలర్ రిలీజ్
రూలర్ ట్రైలర్ వచ్చేసింది
ఆ పాత్రకు న్యాయం చేయలేను: రష్మిక
నాగబాబు స్థానంలో సాయి తేజ్
బాక్సాఫీస్ వద్ద బోరింగ్ వీకెండ్
ఇక తెలుగువారందరికీ వెంకీ మామనే: వెంకటేష్
ప్రభాస్ కొత్త సినిమాకి భారీ బడ్జెట్
Read More From This Category