#NagaChaitanya #SamanthaAkkineni #CoupleGoals
నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే సందర్భంగా మాల్దీవ్స్ వెళ్లారు నాగచైతన్య సమంత జోడి. అక్కడే ఇన్ని రోజులు ఉన్నారు. భర్త బర్త్ డే వేడుకలు కూడా అక్కడ ఘనంగా జరిపించిందిద సమంత అక్కినేని. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిట్టి పొట్టి డ్రెస్సులతో సమంత ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు బాగానే ట్రెండింగ్ అయ్యాయి. సినిమాలు, షూటింగులు అనే విషయాలు పూర్తిగా మర్చిపోయి వారం రోజుల పాటు వేరే లోకంలో ఉండిపోయారు అక్కినేని జోడీ. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో నాగచైతన్య, సమంత వచ్చిన ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో కూడా సమంత అందాలు ఆరబోసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ వచ్చి రాగానే ఎవరి పనుల్లో వారు బిజీ కానున్నారు.
నాగచైతన్య చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో మొదటిది శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ. ఈ సినిమాను పూర్తి చేసి మిగిలిన సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు నాగ చైతన్య. మరోవైపు సమంత సినిమాలు చేయకపోయినా డిజిటల్ మీడియాలో బిజీ అయిపోయింది. ఆహా ప్లాట్ ఫామ్ లో స్యామ్ జామ్ అనే టాక్ షో చేస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. త్వరలోనే చిరంజీవితో సహా ఇంకా చాలామంది సెలబ్రిటీలు టాక్ షోకి రానున్నారు. వాటితో బిజీ కానుంది అక్కినేని కోడలు. ఇవి మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సమంత ఓకే చెబుతుంది. మొత్తానికి కొన్ని రోజుల వెకేషన్ తర్వాత ఫుల్ గా రీ ఫ్రెష్ అయి మళ్లీ పని మొదలు పెట్టనున్నారు అక్కినేని జోడి.
Please Share this article
Related:
Tagged with:
అల్లరి నరేష్ రీమిక్స్ వీడియో సాంగ్ అదుర్స్
ఈ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది
డే అండ్ నైట్ షూట్స్ లో చరణ్
‘సురేష్ ప్రొడక్షన్స్’ నుండి మరో రీమేక్ సినిమా
మెగాస్టార్ ‘లూసిఫర్’ తొలిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
రోజాపై విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
రష్మిక మందన ‘పొగరు’ విడుదల తేదీ వచ్చేసింది
చిరు153వ చిత్రం షూటింగ్ ప్రారంభం
తల్లి పాత్రలకు కూడా సై అంటున్న శృతి హాసన్
ఎఫ్3లో స్పెషల్ రోల్ లో సుప్రీం హీరో
‘లూసీఫర్’ సినిమా కు సంగీత దర్శకుడి గా థమన్
డిజిటల్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించిన మాస్టర్ నిర్మాత
ఆచార్య' మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
ఏమాత్రం తగ్గని ‘రెడ్ మూవీ జోరు
Read More From This Category