#Akhil #PoojaHegde #Bhaskar
అఖిల్ హీరోగా నిలబడటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది.
దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇప్పుడు’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమాకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడిందని తెలుస్తుంది. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఆర్ కె నాయుడు (సాగర్ ) షాదీ ముబారక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ అఖిల్ సినిమా కథ ఒకే లా ఉందట. దాంతో అఖిల్ సినిమాలో మార్పులు చేస్తున్నారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెకండ్ ఆఫ్ లో చాలా వరకు చేంజెస్ చేస్తున్నాడట దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. మార్పులు చేసి కొత్తగా స్క్రిప్ట్ రాసి రీషూట్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ , ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Please Share this article
Related:
Tagged with:
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category