#Meermithun
ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ త్రిష పై సంచలన ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదివరకే గాయని సుచిత్ర.. సూచిలీక్స్ పేరుతో ధనుష్ అమలాపాల్ లాంటి స్టార్ల వీడియోలను లీక్ చేస్తానని బెదిరించి కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది. ఇక త్వరలో మీరాలీక్స్ అనేది కొత్తగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మీరాలీక్స్ ఎవరంటే చెన్నైకి చెందిన సూపర్ మోడల్ యాక్ట్రెస్ మీరా మిథున్.. సూర్య హీరోగా నటించిన గ్యాంగ్ 8 తొత్తకల్ మూవీస్ లలో మెరిసింది. ఈ యంగ్ బ్యూటీ.. సీనియర్ హీరోయిన్ త్రిష తన కెరీర్ పాడుచేస్తుందని సంచలన ఆరోపణలు చేసింది. తనను సైడ్ చేయడం వలనే త్రిష టాప్ స్థాయిలోకి ఎదిగిందని ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేసింది.
అంతేగాక త్రిషకి కులమతాలకు ప్రాధాన్యత ఇస్తుందని.. తనలాంటి ఎంతో మంది నటులను అణగదొక్కడానికి త్రిష పలుమార్లు తన ఉన్నత కుల ప్రస్తావన కూడా తీసిందని ఆరోపించింది. ఆ విధంగానే ఎన్నై ఇరిందాల్ రజినీకాంత్ పేట సినిమాలలో తన పాత్రలు కట్ అవ్వడానికి త్రిషనే కారణమని మీరా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మీరా వ్యాఖ్యలు చర్చలకు దారితీస్తున్నాయి. మరి ఈ మీరా ఆరోపణల పై హీరోయిన్ త్రిష స్పందించకపోయినా ఇండస్ట్రీలో రచ్చ నడుస్తోంది. మీరాకి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బిగ్ బాస్ సీసన్ 3లో పాల్గొని కాంట్రవర్సీ క్వీన్ గా పాపులర్ అయింది. మొత్తానికి అమ్మడు ఇండస్ట్రీ మొత్తం అట్టుడికిపోయే చర్చను లేవనెత్తినదని సినీవర్గాల టాక్.
Please Share this article
Related:
Tagged with:
అమెజాన్ ప్రైమ్ లో విజయ్ మాస్టర్
బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై క్లారిటీ
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాగశౌర్య
ఈసారైనా ఈ మూవీ విలన్ అప్డేట్ వస్తుందా ? రాదా ?
ట్రేండింగ్ లో మరో ఐటెం సాంగ్
దుబాయికెళ్లిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
'లెస్బియన్' పాత్రలో శృతి హాసన్
రామ్ ‘రెడ్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
సుశాంత్ జయంతి సందర్భంగా కంగనరనౌత్ ట్వీట్
ప్రభాస్ పెళ్లిపై ఊహించని సమాధానం ఇచ్చిన కృష్ణంరాజు
పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్
‘క్రాక్’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్
నితిన్ కోసం బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్
సోనుసూద్ కు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
వివాదాల్లో చిక్కుకున్న అల్లరి నరేశ్ 'బంగారు బుల్లోడు' సినిమా
Read More From This Category