#AhamBrahmasmi ##manchuManoj #ManchuManoj
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఈ మధ్య కాలంలో విడిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. అందులో మంచు మనోజ్ కూడా ఉన్నాడు. కొన్నేళ్ల కింద ఈయన తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. దాంతో మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మూడేళ్ల పాటు సినిమాలు కూడా చేయలేదు మనోజ్. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన మనోజ్.. కొన్ని నెలల పాటు ఎవరికీ కనిపించలేదు. స్నేహితులతో కలిసి దేశమంతా తిరిగొచ్చాడు. ఆధ్యాత్మిక చింతనలోకి కూడా వెళ్లిపోయాడు. ఇన్నాళ్లకు మళ్లీ మామూలు మనిషి అయి సినిమాలు చేస్తున్నాడు.
ఈయన్ని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా మనోజ్‌ను ఒప్పించి మరో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యే భార్యతో విడాకుల ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. దాంతో త్వరలోనే మంచు వారబ్బాయి మరోసారి పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ ఎవర్ని చేసుకోబోతున్నాడనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కొడుకు పెళ్లి విషయంలో మోహన్ బాబు ఓ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తుంది. తమ కుటుంబానికి దగ్గరి బంధువైన ఓ అమ్మాయితోనే మనోజ్ పెళ్లి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరితే మే నెలలోనే మనోజ్ రెండో పెళ్లి ఉండబోతుంది కూడా.
మనోజ్ ఇప్పుడు ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. మరి మనోజ్ పెళ్లి వార్తల్లో నిజమెంత ఉందో చూడాలి.
Please Share this article
Related:
Tagged with:
వకీల్ సాబ్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
అడివి శేష్ ‘మేజర్’ టీజర్ విడుదల
ప్రకాశ్ రాజ్ ను అభినందించిన 'ఆచార్య'
‘ఉప్పెన’ సెట్లో కొరటాల శివ వీడియో చూడండి
'ఆహా'లో 16న 'తెల్లవారితే గురువారం'
శ్రేయ ఘోషల్ బేబి షవర్ వేడుక
అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్
‘జాతిరత్నాలు’ పై మంత్రి కేటీఆర్ రివ్యూ
'అన్నాత్తే' షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్
పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ థియేటర్లు సీజ్ చేసిన అధికారులు
‘ఖిలాడి’ వచ్చేశాడు
మహా సముద్రం నుండి అదితి ఫస్ట్ లుక్
చిరంజీవి రీమేక్ చిత్రానికి క్రేజీ టైటిల్
మేజర్ కోసం బరిలో దిగుతున్న ముగ్గురు సూపర్ స్టార్లు
`ఏజెంట్`కోసం వస్తున్న మాలీవుడ్ సూపర్ స్టార్
ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
Read More From This Category