#KrackMovie #KrackOnAha #KrackifiedBlockBuster
కొన్ని సినిమాలు అయితే కనీసం వారం కూడా లేకుండానే ఒరిజినల్ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రవితేజ క్రాక్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. కాకపోతే మరీ వారం రోజుల్లో కాదు కానీ మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుంది. ప్రస్తుతం థియేటర్స్లో మంచి వసూళ్లు సాధిస్తుంది. విడుదలైన రెండు వారాల్లో ఈ సినిమా దాదాపు 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అది కూడా కేవలం 50 ఆక్యుపెన్సీతోనే. 100 శాతం ఉండుంటే కచ్చితంగా ఇప్పటికే 40 కోట్ల షేర్ దాటిపోయేది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా నేపథ్యం కారణంగా సినిమాలు విడుదలైన తర్వాత త్వరగానే ఓటిటిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ముందుగానే నిర్ణయించుకుంటున్నారు.
ఈ మేరకు ముందుగానే ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ మధ్య డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. వారం రోజుల తర్వాత అంటే జనవరి 1న ఈ సినిమా ఓటిటిలో విడుదల చేసారు. జీ స్టూడియోస్ ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమా విషయంలో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తుండటంతో ఓటిటి కాస్త ఆలస్యంగా రానుంది. ఒకవేళ థియేటర్స్ లో సరైన రెస్పాన్స్ రాకపోయుంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు వారాల్లోనే సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని అనుకున్నారు.
అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే మంచి వసూళ్లతో దూసుకుపోతుండటంతో మరో మూడు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను ఆహా దాదాపు 9 కోట్లకు కొనేసిందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే జనవరి 29న క్రాక్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసారు ఆహా యూనిట్. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా కావడం.. పైగా ఆహాలో విడుదల కానున్న తొలి భారీ సినిమా కావడంతో అక్కడ కూడా క్రాక్ కిరాక్ పుట్టిస్తుందని నమ్ముతున్నారు. మరి చూడాలిక.. మాస్ రాజా రచ్చ ఎలా ఉండబోతుందో..?
Please Share this article
Related:
Tagged with:
స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ప్రెస్” మూవీ రివ్యూ
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
Read More From This Category