#KajalAgarwal #Deekay
కథానాయిక కాజల్ పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్టుకు సంతకం చేశారు. నెల రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లును ముంబయిలో మనువాడిన ఆమె తిరిగి షూటింగ్ పనుల్లో పడ్డారు. భర్తతోపాటు చెన్నై చేరుకుని, దర్శకుడు డీకేను కలిశారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న ఓ హారర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ దంపతులతో కలిసి తీసుకున్న ఫొటోను డీకే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సినిమా ఖరారైందని, కాజల్-గౌతమ్‌తో సంభాషణ ఎంతో సరదాగా అనిపించిందని పేర్కొన్నారు.
చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో కాజల్‌కు డీకే కథ నరేట్ చేశారట. ఈ సినిమాలో నలుగురు కథానాయికలకు చోటున్నట్లు తెలుస్తోంది. కాజల్ పాత్రకు సంబంధించిన ఫొటోషూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలతో నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానుంది. 2016లో విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్‌లో మంచి టాక్ అందుకుంది. కాజల్ చేతిలో ప్రస్తుతం ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సగ’, ‘భారతీయుడు 2’ చిత్రాలున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఆమె త్వరలో ‘ఆచార్య’ సెట్లో అడుగుపెట్టబోతున్నారు.
Please Share this article
Related:
Tagged with:
అల్లరి నరేష్ రీమిక్స్ వీడియో సాంగ్ అదుర్స్
ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది
డే అండ్ నైట్ షూట్స్ లో చరణ్
‘సురేష్ ప్రొడక్షన్స్’ నుండి మరో రీమేక్ సినిమా
మెగాస్టార్ ‘లూసిఫర్’ తొలిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది
రోజాపై విమర్శలు గుప్పించిన కత్తి మహేష్
రష్మిక మందన ‘పొగరు’ విడుదల తేదీ వచ్చేసింది
చిరు153వ చిత్రం షూటింగ్ ప్రారంభం
తల్లి పాత్రలకు కూడా సై అంటున్న శృతి హాసన్
ఎఫ్3లో స్పెషల్ రోల్ లో సుప్రీం హీరో
‘లూసీఫర్’ సినిమా కు సంగీత దర్శకుడి గా థమన్
డిజిటల్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించిన మాస్టర్ నిర్మాత
ఆచార్య' మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
ఏమాత్రం తగ్గని ‘రెడ్ మూవీ జోరు
Read More From This Category