ప్రముఖ కమెడియన్ ఎం.ఎస్.నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ మొదటి సారిగా ఒక చిత్రానికి దర్సకత్వం వహించారు. ఈ చిత్రం రేపు విడుదల కానున్నది. ఈ చిత్ర విశేషాలను మరియు ఇంకా ఎన్నో సంగతులను ఆమె ఆంధ్రవిలాస్ తో ఈ క్రింది విధంగా పంచుకున్నారు.
Interviewed by : రాయారావ్ శ్రీరామ్
*డైరెక్టర్ శశి కిరణ్ నారాయణ” ఎలా ఉంది ఈ కొత్త పిలుపు?
శశి కిరణ్ : చాలా హ్యాపీ గా ఉంది.(నవ్వుతూ..)
*సినిమా డైరెక్ట్ చేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
శశి కిరణ్ : లేదు అండి, సినిమాలు అంటే ఇష్టం చాల ఇష్టం ఉండేది కానీ దర్సకత్వం వహిస్తాను అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అవకాశం వచ్చింది అని తెలిసిన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యాను కానీ దాని కన్నా ఎక్కువగా వర్క్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది అని ఫీల్ అయ్యాను.
*మీకు దర్శకురాలిగా అవకాశం ఎలా వచ్చింది?
శశి కిరణ్ : ముందుగా మా నిర్మాత గారు నా ఫ్రెండ్ మదాల వేణు ద్వారా నా గురించి తెలుసుకొని అప్రోచ్ అయ్యారు. కానీ నేను ముందు కాన్ఫిడెంట్ గా లేను ఎందుకంటే నాకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి. కానీ ఆ తరువాత మలయాళం లో సినిమా చూసి చేయగలను అన్న నమ్మకం వచ్చాక ఓకే చెప్పాను.
*మొదటి సినిమానే రీమేక్ ని ఎంచుకున్నారు. మీ అభిప్రాయం లో రీమేక్ ఫిల్మ్ డైరెక్ట్ చెయ్యడం సులభమా లేక స్ట్రెయిట్ సినిమా తీయడం సులభమా?
శశి కిరణ్ : రీమేక్ ఫిల్మ్ చెయ్యడమే పెద్ద కష్టం అండి. ప్రేక్షకుల అంచనాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఒరిజినల్ వెర్షన్ చూసేసి ఉంటారు. మాతృకతో మనం తీసిన సినిమా ని పోలుస్తుంటారు. ఒరిజినల్ వర్షన్ ని అలాగే కాపీ పేస్ట్ చేస్తే మనం క్లిక్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు. So we have to take the SOUL of the film and properly present it. That’s very tough task for a film maker. దాని మీద మేము చాలా గ్రౌండ్ వర్క్ చేశాం.
*సాధారణం గా రీమేక్ సినిమాలు మన నేటివిటీ కి దూరంగా ఉండటం వల్ల హిట్ అవ్వలేక పోవడం జరుగుతుంది. మరి మీ సినిమా విషయం లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
శశి కిరణ్ : నేటివిటీ చాలా ముఖ్యం ఆండి. పక్క బాష లో సినిమా హిట్ అయ్యింది అన్నా కూడా నేటివిటీ వల్లనే. దాన్ని మనం జాగ్రత్తగా అడాప్ట్ చేసుకోవాలి. మన దగ్గర అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు, మన వైపు ఉండే అమ్మాయిలకి ఎలాంటి కట్టుబాట్లు ఉంటాయి అనే వాటి మీద ఎక్కువ కేర్ తీసుకున్నాం. దాన్నే సినిమా లో చూపించే ప్రయత్నం చేసాం.
*ఒరిజినల్ సోల్ ని క్యారీ చెయ్యడానికి స్క్రిప్ట్ ని ఏ విధంగా మలిచారు?
శశి కిరణ్ : చాలా వర్క్ చేశాం. ఇది ఒక సినిమాలా కాకుండా మన ఇంటి పక్కన జరిగే కథలా ఉండాలి అనేది నా ప్రధాన అభిలాష. మన ఇంటి పక్కన జరిగే కథ లా అనిపించాలి అనుకున్నాము. దానికి తగ్గట్టు గా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి సంభాషణలను రాసుకున్నాము.
*ఎన్ని రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసారు? ఎక్కడెక్కడ షూట్ చేశారు? సినిమా నిర్మాణానికి బడ్జెట్ ఎంత అయ్యింది?
శశి కిరణ్ : 38 డేస్ లో షూట్ కంప్లీట్ చేసాం. బడ్జెట్ 2.5 కోట్లు అయ్యింది. షూటింగ్ హైదరాబాద్ లో ఇంకా కేరళ లో చేసాము.
*మీ చిత్రం లో ని ప్రధాన తారాగణం కొత్తవాళ్లు అవ్వడం చేత మీకు కొంచం సులభం అయి ఉంటుంది అని అనుకుంటున్నాము. ఏమంటారు?
శశి కిరణ్ : కొత్త,పాత అని ఏం ఉండదు. సీనియర్ నటులతో వర్క్ చెయ్యడం ఇంకా సులభంగా ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పేది వాళ్ళు త్వరగా అర్ధం చేసుకొని చేసేస్తూ ఉంటారు. అదే కొత్త వాళ్ళు మనం చెప్పింది అర్దం చేసుకొని చెయ్యడానికి కొంచం టైమ్ పడుతుంది.
*రావు రమేష్ లాంటి సీనియర్ యాక్టర్లని అలానే మీ నాన్న గారిని డైరెక్ట్ చెయ్యడం ఎలా అనిపించింది?
శశి కిరణ్ : ఫస్ట్ లో కొంచం నర్వస్ ఫీల్ అయ్యాను కానీ తర్వాతర్వాత సెట్ అయిపోయాను. సెట్ లో వాళ్ళ నుండి రొజూ చాలా నేర్చుకున్నాను.
*ఈ సినిమా లో మీరు ఒరిజినల్ వెర్షన్ లో ఉన్నసంగీతాన్ని వాడారు. ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారు? అలాగే చాలా మంది పాటలకు సంబంధించి లిరిక్స్ క్లియర్ గా వినపడుతున్నాయి, తెలుగు లో ఉన్నాయి అని అంటున్నారు. మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
శశి కిరణ్ : ఈ సినిమాకి సంగీతం చాలా ముఖ్యం. అందుకే సినిమా సోల్ దెబ్బ తినకుండా అదే సంగీతాన్ని ఈ చిత్రానికి కూడా వాడాము. నేను లిరిక్స్ విషయంలో చాలా మంది ని కాంటాక్ట్ అయ్యాను కానీ చివరకు రాకేందుఅద్బుతమైన సాహిత్యాన్ని ఈ చిత్రానికి అందించాడు.
*”సాహెబా సుబ్రహ్మణ్యం” అనే టైటిల్ థాట్ ఎలా వచ్చింది?
శశి కిరణ్ : టైటిల్ కోసం కూడా చాలా వర్క్ ఔట్ చేశాం. ‘నా’ అనే అక్షరం తో పెట్ట్టాలి అని చాలా ఆలోచించాము. అలా ఒక రోజు ఆలోచిస్తుంటే సాహెబా, సుబ్రహ్మణ్యం ఈ రెండిటినీ కలిపేస్తే ఎలా ఉంటుంది అని అలోచించి మా టీం తో చర్చించి ఆఖరికి సాహెబా సుబ్రహ్మణ్యం ఫైనల్ చేసాము.
*ఈ సినిమాకి మీ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఏంటి?
శశి కిరణ్ : నిర్మాత నాగేశ్వర్ రావు గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్.
*ఒక మహిళా దర్శకురాలిగా, ‘స్టార్ కమెడియన్’ యం.యస్.నారాయణ గారి కూతురి గా మీకు కొన్ని రెస్పోంసిబిలిటీస్ ఉంటాయి, మీరు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు?
శశి కిరణ్ : యం.యస్.నారాయణ గారి అమ్మాయి గా నా రెస్పాంసబిలిటీ ఏంటంటే మా ఫాదర్ పేరుని తీసుకెళితే తరువాతి లెవెల్ కి తెసుకెళ్లాలి కానీ కిందకి తీసుకురాకూడదు. అది నేను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను. డైరెక్టర్ అంటే అన్నీ వింగ్స్ మీద కమాండ్ ఉండాలి. దానర్ధం అన్నీ నాకు వచ్చి ఉండాల్సిన అవసరం లేదు కానీ తెలిసి ఉండాలి. ఆ విషయం మీద బాగా హార్డ్ వర్క్ చేశాను.
*సెకండ్ ఫిల్మ్ కోసం ఎవరన్నా అప్రోచ్ అయ్యార మిమ్మల్ని?
శశి కిరణ్ : కొంతమంది అయ్యారు కానీ ఏది ఫైనల్ అవుతుందో తెలీదు. వేచి చూడాలి!
Please Share this article
Related:
Tagged with: interviewofsasikirannarayana
శేఖర్ కమ్ముల రూట్ మార్చాడా?
అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు
కమిట్ అయ్యాను కాబట్టి వదిలిపెట్టను: రష్మిక
విజిల్ రిలీజ్ ఆపేసిన కోర్టు
సెక్సీయెస్ట్ ఏషియన్ మేల్ 2019 గా హ్రితిక్
అమితాబ్ ని వెంటాడుతున్న అలనాటి వ్యాఖ్యలు
రూట్ మార్చిన నాని
షకీలా సినిమాకు సెన్సార్ సమస్యలు
దూసుకెళ్తున్న సరిలేరు సాంగ్
హిందీ కోసం తెలుగును వాడుకొనని అంటుంది
నాగశౌర్య బాడీ చూశారా?
శింబు స్థానంలో రాఘవ లారెన్స్
ఆకట్టుకుంటున్న ప్రతిరోజూ పండుగే ట్రైలర్
రాంగోపాల్ వర్మ బ్యూటీఫుల్ సెన్సార్ పూర్తి
మరోసారి పాట పాడిన రాశిఖన్నా
సరిలేరు ట్రాప్ లో పడని దిల్ రాజు
Read More From This Category