'రియల్ లైఫ్‌లో నాన్నతో మీరందరూ ఎలా ఉంటారో నేనూ అలాగే ఉంటాను. అయితే నాన్నకు భయపడను. భయం అనే కాన్సెప్ట్ లేకుండా ఇంట్లో నన్ను పెంచార'ని అంటున్నారు కథానాయకుడు రామ్. తాజాగా 'హైపర్' చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాశిఖన్నా కథానాయికగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 30న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈనేపథ్యంలో బుధవారం రామ్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
సోషల్ కాజ్ కోసం ఫైట్..అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిదని ట్రైలర్స్, పోస్టర్స్ చూడగానే అనిపిస్తుంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంతో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉంటుంది. ప్రతి సినిమాలో అమ్మాయి కోసమో, నాన్న కోసమో, అమ్మ కోసమో ఫైట్ చేసేవాడిని కానీ ఈ చిత్రంలో ఓ సోషల్ కాజ్ కోసం ఫైట్ చేస్తాను. అయితే మెసేజ్‌లు ఇచ్చే వయసు కాదు నాది. అందుకే ఈ చిత్రంలో సత్యరాజ్ వంటి నటుడిని తీసుకున్నాం. దీనివల్ల షుగర్ కోటెడ్ టాబ్లెట్లా మనం చెప్పాలనుకున్న మెసేజ్‌ని చెప్పే వీలు కలిగింది.
ప్రతి సినిమాను డిఫరెంట్‌గానే..ప్రతి సినిమాను డిఫరెంట్‌గానే చేయాలని అనుకుంటాను. గత చిత్రం 'నేను శైలజ' చిత్రంలో నా నటన చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు. క్లాస్ ఆడియెన్స్ చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నా స్టయిల్ ఆఫ్ డాన్స్ మూమెంట్స్, యాక్షన్ కోరుకునే ప్రేక్షకుల కోసం చేసిన చిత్రమిది. 'హైపర్' అనే టైటిల్‌ని ఫైనల్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ఫైనలైజ్ చేశారు. అయితే ఈ టైటిల్‌ను నా కోసమే పెట్టమని ఫోర్స్ చేసినట్టు అందరూ భావిస్తారని దీని గురించి ఇప్పటివరకు నేనేం మాట్లాడలేదు. అయితే పోస్టర్లో 'ప్రతి ఇంట్లో ఒకడుంటాడు' అనే ట్యాగ్‌లైన్ చూడగానే టైటిల్ నాకూ బాగా నచ్చింది.
నాన్నని అతిగా ప్రేమించే కొడుకు..'మిర్చి', 'బాహుబలి', 'నేను శైలజ' వంటి సినిమాల్లో సత్యరాజ్ క్యారెక్టర్ చాలా సీరియస్‌గా ఉంటుంది. వాటికి భిన్నంగా ఈచిత్రంలో ఆయన పాత్ర కామిక్‌గా ఉంటుంది. సహజంగా అమ్మ మీద అందరికీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను పలు సందర్భాల్లో చూపిస్తూనే ఉంటాం. అయితే నాన్నపై ప్రేమ ఉంటుంది. కానీ అది సందర్భానికి అనుగుణంగానే బయటకు వస్తుంది. ఈ సినిమాలో హీరోకి నాన్నంటే ప్రేమ కాదు పిచ్చి. తన ప్రేమను అన్ని సందర్భాల్లోనూ ప్రదర్శిస్తుంటాడు. ఈ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. ఈ సినిమాలోని పాత్రతో పోల్చుకుంటే, రియల్ లైఫ్‌లో నాన్నతో మీరందరూ ఎలా ఉంటారో నేనూ అలాగే ఉంటాను. అయితే నాన్నకు భయపడేలా మా ఇంట్లో పెంచలేదు.
రాశిఖన్నా పక్కా యాప్ట్..
ఈ సినిమా లవ్‌స్టోరీ కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దీంతోపాటు లవ్ అనే ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు రాశిఖన్నా పక్కా యాప్ట్. తనలో కామెడీ టచ్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల విడుదలైన 'సుప్రీమ్' చిత్రంలో కూడా అది ఫ్రూవ్ అయ్యింది. దీంతో ఈ చిత్రంలో హీరోయిన్గా రాశిఖన్నాని ఎంపిక చేశాం. డ్యూయెల్ టచ్ ఉన్న క్యారెక్టర్లో రాశి ప్రేక్షకుల బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
మెచ్చ్యూరిటీ పెరిగింది..
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో 'కందిరీగ' చేశాను. ఆ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి, ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్‌లో మెచ్చ్యూరిటీ పెరిగింది. తనలో కూడా చాలా హైపర్ ఉంది. ఈ సినిమా దర్శకుడిగా తనకి మరింత మంచి పేరు తీసుకొస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో మొదటి సినిమా నేనే చేయాల్సి ఉంది. అది ఇప్పటికి కుదిరింది. ఇక నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్‌సుంకర విషయానికొస్తే చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. పైకి చాలా సాప్ట్‌గా కనిపిస్తారుగాని చాలా హైపర్ ఉన్న పర్సన్స్. వారి హైపర్ కారణంగానే ఈ సినిమా మూడు నెలల్లో కంప్లీట్ అయ్యింది.
అలవాటు పడిపోయా..ఇండిస్టీలోకి ఎంట్రీ ఇచ్చి పదేండ్లు పూర్తవుతుంది. ఈ జర్నీలో సక్సెస్లతోపాటు ఫెయిల్యూర్స్ కూడా చూశా. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను కాబట్టే ప్రజెంట్ ఓ సెటిల్డ్ స్టేజ్‌కి చేరుకున్నా. టెన్షన్ పడితే ప్రతి విషయంలోనూ టెన్షన్ పడాల్సి వస్తుంది. పడకూదనుకుంటే కూల్‌గా ఉండొచ్చు. అయితే ప్రతి సినిమా విడుదల సమయంలో బేసిక్ టెన్షన్ మాత్రం ఉంటుంది. ప్రస్తుతం 'హైపర్' రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. దీని తర్వాత 'నేను శైలజ' దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలోనే ఓ సినిమా ఉంటుంది. అది కూడా ఆయన వెంకటేష్‌గారితో చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఉంటుంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
Please Share this article
Related:
Tagged with: ram hyper telugu
శేఖర్ కమ్ముల రూట్ మార్చాడా?
అమ్మాయిలకు మెగా కోడలు జాగ్రత్తలు
కమిట్ అయ్యాను కాబట్టి వదిలిపెట్టను: రష్మిక
విజిల్ రిలీజ్ ఆపేసిన కోర్టు
సెక్సీయెస్ట్ ఏషియన్ మేల్ 2019 గా హ్రితిక్
అమితాబ్ ని వెంటాడుతున్న అలనాటి వ్యాఖ్యలు
రూట్ మార్చిన నాని
షకీలా సినిమాకు సెన్సార్ సమస్యలు
దూసుకెళ్తున్న సరిలేరు సాంగ్
హిందీ కోసం తెలుగును వాడుకొనని అంటుంది
నాగశౌర్య బాడీ చూశారా?
శింబు స్థానంలో రాఘవ లారెన్స్
ఆకట్టుకుంటున్న ప్రతిరోజూ పండుగే ట్రైలర్
రాంగోపాల్ వర్మ బ్యూటీఫుల్ సెన్సార్ పూర్తి
మరోసారి పాట పాడిన రాశిఖన్నా
సరిలేరు ట్రాప్ లో పడని దిల్ రాజు
Read More From This Category