గ్రీన్ టీ తాగే అలవాటున్న వారికి గుండెనొప్పి రాదు. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా నివారిస్తూ గుండెపోటు రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్సు, పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి కేన్సర్ బారిన పడకుండా నియంత్రిస్తుంది గ్రీన్ టీ. వృద్ధాప్య లక్షణాలను దరిచేరకుండా ఆయుష్షును పెంచే గుణం గ్రీన్‌టీలో సమృద్ధిగా ఉంది. గ్రీన్ టీతో పాటు పుదీనా, తులసి, ఆకుల్ని కలిపి మరిగించి తాగితే జలుబు భారం తగ్గి చర్మసౌందర్యం కాంతి పెరుగుతుంది. శరీరంలో కొవ్ఞ్వను కరిగించి, భారీకాయం రాకుండా అదుపుచేస్తుంది. గ్రీన్‌టీలో చక్కెర కలపకుండా తాగితే దంతాలను నాశనం చేసే బాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొని దంత ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. గ్రీన్‌టీలో వ్యాధి నిరోధకశక్తులు అధికంగా ఉన్నాయి. అందుకే వ్యాధులు రాకుండా నివారిస్తుంది. తాజా లావెండర్ పూలతో లేదా ఎండిన పూలను టీ పాత్ర నిండుగా తీసుకొని దానిలో నీరుపోసి, 10నిమిషాల తర్వాత మరిగిస్తే టీ రెడీ. ఈ టీని తాగితే మనస్సు, శరీరం రెండూ తాజాగా ఉంటాయి. నిద్రలేమి తగ్గి, మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయానికి ఇన్ఫెక్షన్ను రాకుండా చేస్తుంది. నిమ్మగడ్డ, పుదీనా, లవంగపొడి, దాల్చినచెక్కపొడి, యాలకులు, తులసిఆకులు, చిన్న అల్లంముక్కల్ని చేర్చి కచ్చాపచ్చాగా నూరి తయారుచేసే హెర్బల్ టీని ఉదయాన్నే తాగితే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. అల్లం, మిరియాలు సమభాగాలుగా తీసుకుని నూరి కావలసినంత నీటిలో మరిగించి కొంచెం పాలు చక్కెర కలిపి తాగితే ఉదరభారం తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రోజూ పూలరెక్కల్ని తగినంత నీటిలో వేసి మరిగించి చక్కెర పాలు కలిపి తాగడం వల్ల ఎంతో ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటారు. అదో ఆహ్లాదమైన సువాసనతోరుచి కల్గిన టీ రోజ్ టీ.
Please Share this article
Related:
Tagged with: greentea
రాగి పాత్రలోని నీళ్లు తాగండి
అమ్మాయులు ఉప్పు తగ్గించాలి
అల్బకర తో అందంగా..
వ్యాయామాలకు ఏ టైం మంచిది?
కడుపుబ్బరం తగ్గటానికి కి చిట్కాలు
గ్రీన్ టీ తాగితే గుండెనొప్పి దూరం
సోయాతో చక్కని ఆరోగ్యం
హైపర్‌టెన్షన్ నియంత్రణకు ఆహార నియమాలు అవసరం
నిమ్మకాయ సుగుణాలు
బొప్పాయి పండు తింటే
చిట్కాలు - 4
చిట్కాలు - 3
చిట్కాలు - 2
తిండి తగ్గిస్తే ఏమవుతుంది?
సూపర్ హెల్త్ కి చిట్కాలు
ఆలస్యంగా లేస్తే.. అంతేమరి..!
Read More From This Category