వాల్డ్ డిస్ని నుంచి వచ్చిన యానిమేటెడ్ సినిమా ప్రొజెన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. 2013 లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ డాలర్లు రాబట్టింది. ఆ ఏడాది ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ఫ్రోజెన్ 2 ని తీసుకొచ్చింది డిస్నీ సంస్థ.
ఇందులో ప్రధాన పాత్రలైన యువ రాణి ఎల్సాకు ప్రముఖ నటి నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పగా....చిన్నారి ఎల్సా పాత్రకు మహేష్ కూతురు సితార గాత్రదానం చేసింది. హాస్యనటుడు ప్రియదర్శి మంచు మనిషి ఓలఫ్ కు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ.... 'నిజానికి డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. యానిమేటెడ్ సినిమాలు పెద్దగా చూడను. కానీ ఈ సినిమా కోసం డిస్ని వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పను. ఎందుకంటే నాకు ఫ్రోజెన్ చాలా ఇష్టం.
అందులోని ఎల్సా నాకు బాగా గుర్తుంది. పిల్లలకు చాలా ఇష్టమైన బలమైన పాత్ర ఇది. తొలిభాగం వచ్చినప్పుడు నా స్నేహితురాలు చెప్తే వెళ్లి ఆ సినిమా చూశా. అప్పుడే చాలా బాగా నచ్చేసింది. ఈ పాత్రకు నాకు కొన్ని పోలికలు ఉన్నాయి. అవి ఏంటనేది కచ్చితంగా చెప్పలేను. ఇలా ఓ యానిమేటెడ్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా కొత్తగా అనిపించింది' అని అన్నారు.
నమ్రత మాట్లాడుతూ.... 'తొలిసారి సితార డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఓ తల్లిగా ఎంతో సంతోషించాను. అంతేకాక కాస్త భయపాడ్డాను. ఎల్సాకి సితార చక్కగా డబ్బింగ్ చెప్పింది. దీనికోసం తాను ప్రత్యేకంగా ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. తన డాన్స్ టీచర్ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. సీతారాకు ఎల్సా పాత్రంటే చాలా ఇష్టం. ఆ పాత్రకు ఇప్పుడు తానె డబ్బింగ్ చెప్పడం ద్వారా తన కల నిజమైనట్లు అయ్యింది' అని అన్నారు.
సితార మాట్లాడుతూ.... చిన్నారి ఎల్సాకు డబ్బింగ్ చెప్పడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఈ సినిమా చేస్తున్నట్లు నాన్నకు చెప్పినప్పుడు సర్ప్రైజ్గా ఫీలయ్యాను అని చెప్పింది.
Please Share this article
Related:
మూల కాణాలని బద్రం చేయనున్న మహేష్ నమ్రత జంట
ఆ రూమర్ ని కొట్టివేసిన మహేష్ నమ్రత
మహేష్ టాటూ వేసుకున్న నమ్రత...
నమ్రత ర్యాంప్ వాక్ : ఫోటో టాక్
మహేష్ కి కాంపిటేషన్ లేదు : నమ్రత
Tagged with: namrata sitara nithyamenon frozen 2 telugu trailer
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
‘మాస్టర్’ సినిమాపై మెగా డాటర్ అదిరిపోయే రివ్యూ
వైరల్‌గా మారిన రాశీ ఖన్నాఇన్స్టాగ్రామ్ పోస్ట్
మాస్ మసాలా సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్
వైరల్ అవుతున్న నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ పిక్స్
పెళ్లికి ముందు యాక్సిడెంట్ చేసిన హీరో
పేదల పాలిట ఆపద్బాంధవుడిగా సోనూసూద్
బంగారు బుల్లోడు రివ్యూ
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డైరెక్టర్
ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ అదుర్స్
రెడ్’ 9 డేస్ కలెక్షన్స్!
Read More From This Category