అమ్మాయిలకు ఒత్తయిన కురులే అందం... మరి అలాంటి కురులు పట్టులా మెరవాలంటే హానికరమైన హెయిర్ స్త్టెలింగ్ టూల్స్, ఉత్పత్తులకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. చాలామంది అందంగా కనపడాలని రకరకాల హెయిర్ స్త్టెల్స్‌ని చేయించుకుంటారు. కానీ అలా చేయడం వల్ల జుట్టు తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుందని చాలా మంది గ్రహించరు. హానికరమైన పదార్థాల నుంచి రక్షణ పొంది జుట్టు పట్టులా మెరవాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దామా మరి... వేడి నుంచి రక్షించుకోండి మీకు తెలుసా? పార్లర్స్‌లో జుట్టు స్ట్రెయిట్‌గా లేదా కర్లీగా షేప్ చేయించుకోవడానికి వాడే మిషన్ల నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. దీంతో జుట్టు పొడిబారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే షేప్ చేయించుకోవడానికి ముందే స్ప్రే, సీరం, క్రీం.. వంటి వేడి నుంచి రక్షించే ఉత్పత్తులను జుట్టుకు అప్త్లె చేసుకోవడం మంచిది. బ్లో డ్రయర్స్, ఫ్లాట్ ఐరన్స్, కర్లింగ్ ఐరన్స్ కురులకు ప్రొటీన్లు అందకుండా చేసి అందులో ఉండే సహజమైన ఆయిల్స్‌ను కోల్పోయేలా చేస్తాయి. డ్రయర్‌తో జుట్టు ఆరబెట్టుకుంటే అందులో ఉన్న తేమ పోయి పొడిబారిపోతుంది. అందువల్ల మంచి అయానిక్ బ్లో డ్రయర్‌ని వాడటం వల్ల జుట్టుకు పటుత్వం లభిస్తుంది. మంచి షాంపూలే వాడాలి సహజసిద్ధమైన నూనెల వల్లే కురులు మెరుపును సంతరించుకుంటాయి. కానీ షాంపూల్లో ఉండే హానికరమైన రసాయన పదార్థాలు ఈ నూనెల్ని పోగొడతాయి. అందుకే జుట్టు రాలిపోవడాన్ని తగ్గించే, కురులు ఒత్తుగా పెరిగేలా చేసే షాంపూలను.. సంబంధిత వైద్యుల, నిపుణుల సలహాతో మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఈ ఉత్పత్తుల్లో జుట్టు పెరగడానికి కావాల్సిన నూనెలు, పోషక పదార్థాలు ఉంటాయి. మేలు చేసే మైక్రోఫైబర్ టవల్ చాలా మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరిపోవాలని టవల్‌తో గట్టిగా తుడుస్తారు. కానీ అలా చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మైక్రోఫైబర్ ఉండే టవల్ని ఉపయోగించడం వల్ల అది త్వరగా నీటిని పీల్చుకొని జుట్టు ఆరిపోతుంది. రంగేస్తున్నారా? మీరు ఇప్పటి వరకూ జుట్టుకు రంగు వేయలేదు. కానీ ఒకవేళ ఇప్పుడు వేయాలనుకుంటే మాత్రం అమ్మోనియా, పెరాక్సైడ్ లేని రంగును ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే అమ్మోనియా ఉండే రంగులు జుట్టులో సహజంగా ఉండే తేమని పోగొడతాయి. జుట్టుకు వేసే రంగుకు ఎలాంటి వాసనా లేకపోతే అందులో అమ్మోనియా కలవనట్లే. ఇప్పుడు చాలా పార్లర్లలో అమ్మోనియా ఫ్రీ రంగులు లభిస్తున్నాయి. నిపుణుల సలహాతో జుట్టుకు హాని చేయని రంగులను మాత్రమే ఎంచుకోవాలి. కండిషనర్లు కనీసం వారానికోసారైనా జుట్టుకు కండిషనింగ్ మాస్క్ వేసుకోవడం వల్ల కురులు నిర్జీవం కాకుండా జాగ్రత్త పడొచ్చు. మనం ఎంచుకునే కండిషనింగ్ మాస్క్‌లు జుట్టును పొడిబారకుండా, హాని చేయకుండా ఉంటే చాలు. ఆరోగ్యవంతమైన కురుల కోసం... * హెయిర్ స్త్టెలింగ్ కోసం జుట్టుపై ఎలాంటి రసాయనిక పదార్థాలను ఉపయోగించకూడదు. * మీ కురులను బట్టి నూనెలు, కండిషనర్లు ఎంచుకోవడం మంచిది. * ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నారా? అయితే వాతావరణ మార్పుల వల్ల జుట్టుకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడండి. * ఈత కొట్టేటప్పుడు టోపీ ధరించడం మంచిది. * ఎగ్‌వైట్, స్ప్రౌట్స్, చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుకు ప్రొటీన్లు అధికంగా అందుతాయి. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పటుత్వం లభిస్తుంది. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కురులు ఒత్తుగా.. ఆరోగ్యంగా.. ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా! మరి ఇవన్నీ ట్రై చేసి జుట్టును పట్టులా మెరిపించండి.
Please Share this article
Related:
Tagged with: forhealthyhairchitkalu1414029
తెలుగువారు ఆరంభ శూరులని తెలుసు
ఆరోగ్యవంతమైన కురుల కోసం.
జుత్తు ఊడిపోతోందా...?!
మీ మొటిమల సమస్య కి పరిష్కారం
చిట్కాలు - 5
చిట్కాలు - 1
ఆలివ్ ఆయిల్ చిట్కాలు
వంటింటి చిట్కాలు
సోయాతో చక్కని చిట్కాలు
కడుపు నొప్పికి చెక్ పెట్టాలా?
వ్యాయామం తరువాత ఆమ్లెట్
ఇలా స్తన సౌందర్యం పెంచుకోవచ్చు
కొబ్బరి తో
మిరపకాయతో కొవ్వు మాయం
అధిక బరువు తో బాధ -దాల్చినచెక్క తో మాయం
Read More From This Category