బుల్లితెరపై కెరీర్‌ను మొదలుపెట్టిన స్వాతి నేడు దక్షిణాది భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటోంది. స్వాతి కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం త్రిపుర. రాజకిరణ్ దర్శకుడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా స్వాతి పాత్రికేయులతో చెప్పిన ముచ్చట్లివి..
'రేపటి గురించి ఆలోచించడం మానేసి, నేటి గురించే ఆలోచిస్తున్నాను. ప్రస్తుత జీవితంలో బతకడానికి ప్రయత్నిస్తున్నాను' అని అంటున్నారు హీరోయిన్ స్వాతి.
పల్లెటూరి పిల్లగా.. ఈ చిత్రంలో నాది పల్లెటూరి అమ్మాయి పాత్ర. పేరు 'త్రిపుర'. అల్లరికి కాస్త చిలిపితనం కలిపితే ఎలా ఉంటుందో నా పాత్ర కూడా అలా ఉంటుంది. చక్కగా పెద్దలు కుదిర్చిన వివా హం చేసుకుని భర్తతో సుఖంగా జీవిస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో పోల్చితే ఇది చాలా ప్రత్యేకం. ఆ అమ్మాయికి కలలు యాదృచ్చికంగా నిజం అవుతుంటాయి. అలాంటి సమయంలో వచ్చిన ఓ కల ఆమె జీవితాన్ని ఏవిధంగా మార్చిందనేదే కథాంశం. ఇది హర్రర్ చిత్రం కాదు. మాయలు మంత్రాలతో కూడిన నిమ్మకాయల చిత్రం కాదు. ఇదొక థ్రిల్లర్ చిత్రం. సినిమా అంతా సస్పెన్స్‌తో సాగుతుంది. దానికి తోడు సప్తగిరి లాంటి హాస్యనటుల కామెడీ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజారు చేసే చిత్రమిది. అలా ఉండకూడదని.. 'గోల్కొండ హై స్కూల్' చిత్రంలో నేను చీర కడితే అస్సలు సూట్ అవ్వలేదు, మరీ చిన్న పిల్లలా ఉన్నావు అన్నారు. అందుకే కొంచెం బరువు పెరిగాను. బరువు పెరగడమనేది ఈ చిత్రానికి అవసరమైంది. పెళ్లైన అమ్మాయిగా కనిపించాలంటే ఆ మాత్రం ఉండాలనిపించింది. ఇందులో సాధారణ గృహిణిగా, నిజజీవితంలో ఎలా ఉంటామో అలానే సహజంగా కనిపిం చేందుకు ప్రయత్నించాను. అలాగే సినిమా షూటింగ్లో 24గంటలు సినిమా గురించే ఆలోచి స్తాను. ఇంకా డిఫరెంట్‌గా ఎలా కనిపించాలనే దానిపై దృష్టిపెడుతున్నాను. హీరోయిన్లు గ్లామరస్‌గా కనిపించాలని కోరుకుంటారు. ఇందులో అందంగా కనిపించడానికి ట్రై చేశా.
నవీన్ బిల్డప్ కొడుతున్నాడనుకున్నా.. నవీన్ చంద్రని మొదటి రోజు చూసినప్పుడు చాలా సైలెంట్‌గా కనిపించాడు. మొదటి రోజు కదా కాస్త బిల్డప్ కొడుతున్నాడేమో అనుకున్నా. కాని సినిమా చివరి వరకు అలానే కనిపించాడు. ఆయన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పులేదు. 'ఈ అబ్బాయి నిజంగానే చాలా డిసెంట్' అని అప్పుడర్థమైంది.
అప్పుడు చాలా కోపం వచ్చేది.. ఒకప్పుడు నా గురించి సైట్లలో బ్యాడ్‌గా రాస్తే చాలా కోపం వచ్చేది. రక్తం మరిగేది. కాని ఇప్పుడలా ఉండడం లేదు. అలాంటివి చదివి పూర్తిగా మారిపోయా. అగ్ర కథానాయికగా ఎదగలేదనో, నాకు ఛాన్స్‌లు రావడం లేదనేదాని గురించి ఆలోచించడం మానేశా. నాకు వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తున్నాను. రేపటి గురించి ఆలోచించడం మానేసి ఈ రోజు ఎలా ఉండాలనే దానిపై దృష్టిపెడుతున్నా. ప్రస్తుతంలో బతకడానికి ప్రయత్నిస్తున్నాను. టైమ్ దొరికినప్పుడు మంచి పుస్తకాలు చదువుతున్నాను.
ఫ్యామిలీతో ఎంజారు చేస్తున్నా.. ఇటీవల అమ్మతో కలిసి యుఎస్ వెళ్ళాను. అక్కడ న్యూ యార్క్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి వెళ్లినప్పుడు ప్రపంచం చాలా పెద్దది. మనమెందుకు ఆవేశపడుతున్నామనిపించింది. ఒకవేళ సినిమాల కంటే బెటర్‌గా ఇంకేదైనా ఛాన్స్ వస్తే దానిలోకి వెళ్ళిపోతా. అది ప్రొఫెషన్ పరంగానైనా, పెళ్ళిపరంగానైనా. అలాగే సినిమాలు చాలా పాస్ట్‌గా చేయడం వల్ల ఫ్యామిలీతో గడిపే సమయం దొరుకుతుంది. పెళ్ళి గురించి కూడా వారితో ఫ్రీగా డిస్కస్ చేస్తున్నాను. అర్థం చేసుకునే వ్యక్తి కోసం చూస్తున్నాను. నన్ను సంతోషంగా చూసుకోగలడనే నమ్మకం ఎవరిమీదైనా కలిగితే, అతన్నే పెళ్లాడి చక్కగా నా ఇల్లు సర్దుకుంటూ కూర్చుంటా. ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజారు చేయాలి కదా.
తమిళంలో రెండు ప్రాజెక్టులు.. ఈ ఏడాది నాకు సంబంధించి మలయాళం, తమిళం, తెలుగులో కలిసి మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అన్నీ మంచి ఆదరణ పొందాయి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ 'త్రిపుర' కూడా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. దీని తర్వాత ప్రస్తుతానికి తమిళంలో రెండు సినిమాలు షూటింగ్లో ఉన్నాయి. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక వాటిపై దృష్టిసారిస్తా. మరికొన్ని చిత్రాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
Please Share this article
Related:
Tagged with: colorsswatiinterview1686753
ఊరంతా ఏమనుకుంటున్నారు?- శ్రీనివాస్ అవసరాల
చరణ్ చేయకపోతే నేనే చేస్తా - వరుణ్ తేజ్
అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టా
స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా-లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
సంపూర్నేష్‌బాబు ఇంటర్వ్యూ
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ జోడి బాగాలేదా ? డాలీ ఇంటర్వ్యూ
ఎన్ని సినిమాలైనా ఆడతాయి-శర్వానంద్ ముచ్చట్లు
ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ -చిరంజీవి ఇంటర్వ్యూ హైలైట్స్
ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే
అదే జనాలను కూర్చోపెడుతుంది-చరణ్ ఇంటర్వ్యూ
విలన్‌గా నటించాలనే నా కోరిక తీరిపోయింది
నా దగ్గర పదేండ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయి-పూరీ ఇంటర్వ్యూ
త్వరలోనే నిర్మాతగా
మెచ్చ్యూరిటీ పెరిగిందిరామ్ ఇంటర్వ్యూ
డేంజర్ నుంచి బయటపడ్డా-నాని
Read More From This Category