చిరు సినిమాకి నిర్మాతతో సమస్య ఏర్పడింది అంటే నమ్మశక్యం కాని విషయం. కానీ, చిరు 150వ సినిమాకి రామ్ చరనే నిర్మాత కదా ఇక సమస్య ఏంటి అని అనుకుంటున్నారా? సమస్య ఉన్నది. చిరంజీవి హీరో అయి, నిర్మాత చరణ్ కాక మరోకరు అయ్యుంటే.... పరిస్థితి మరోలా ఉండేదని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి అంటే ఒకప్పుడు మెగాస్టార్. ఎవరి వచ్చి నటించి వెళ్ళమన్నా వెళ్ళే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
ముందు పారితోషికం ఫైనల్ కావాలని అంటున్నారు. దాంతో ఇప్పటివరకు హీరోయిన్ ఎత కాలేదు. ఎవరిని అడిగినా నో అనడమో, చిరు పక్కన కదా అని భారీ పారితోషికం డిమాండ్ చేయడమో జరుగుతుంది. దాంతో వారు నో అంటున్నారు. అదే మరో నిర్మాత అయ్యి ఉంటె, మరో దగ్గర సర్దుబాటు చేసుకుందాం, అని తెగించి ఎంతో కొంతకు ఎవరో ఒక హీరోయిన్ ని తీసుకొచ్చి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. దర్శకుడు కానీ, ఇతరులు కానీ ఏదైనా ఇలా చేద్దాం అని చెప్పాలంటే నిర్మాత అనేవారు మరొకరు ఉంటె సులువుగా ఉండేది. కానీ చరణ్ అవడంతో సులువుగా ఇలా కాదు, అలా కాదు అని చెప్పలేకపోతున్నారట.
అంతేకాక అది కావాల్సిందే, ఇది కావాల్సిందే అని కచ్చితంగా, గట్టిగా మాట్లాడేవారు కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నారు అని పరిశ్రమలో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరోపక్క ఎంతమంది రైటర్లు వర్క్ చేస్తున్నా కామెడీ ఇంకా సరిగ్గా సెట్ కావడం లేదు అని మెగాస్టార్ ఫీల్ అవుతున్నారని వినికిడి. నిర్మాత అనేవాడు లేకపోవడంతో, సినిమా ప్రోగ్రెస్ మీద తొందర లేదు. మెగాస్టార్ స్వంత సినిమా, ఎప్పుడు పూర్తి కావాలనుకుంటే అప్పుడు చేసుకుంటారు, మనకేల తొందర అనే మూడ్ యూనిట్ జనాల్లో కనిపిస్తోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: chiranjeevi kathilantodu ramcharan
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category