#ViratKohli #AnushkaSharma
గర్భిణీలు యోగా చేయడం మంచిదే. కానీ ఇలా తలకిందులుగా శీర్షాసనం ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే ఇది ఎంతటి దుస్సాహసమో అనిపిస్తోంది. అనుష్క శర్మ ఇటీవలే తన గర్భానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు. ఇక గర్భిణి అయిన తన సతీమణిని విడిచి కోహ్లీ ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితి. ఆట తో ఓవైపు బిజీ అయినా.. వీలున్నంతవరకూ ఇంటికే అంకితమవుతూ అనుష్క ఆలనా పాలనా చూడాలనుకుంటున్నారట. ఇటీవల ఆసీస్ టూర్ కి ముందు తనతో కలిసి జిమ్ యోగా చేస్తూ సమయం స్పెండ్ చేశారు. తాజాగా భర్త విరాట్ కోహ్లీతో కలిసి యోగా చేస్తున్నప్పటి త్రోబాక్ ఫోటోను అనుష్క శర్మ సోషల్ మీడియాలో విడుదల చేయగా అంతర్జాలంలో వైరల్ అయ్యింది. గర్భిణి అయిన భార్యకు విరాట్ శీర్షాసనం వేయడానికి సాయపడుతుండడం అందరినీ ఆకర్షించింది. అతడి సాయం ఎంతో గొప్పది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.తల్లి కాబోతున్న అనుష్క శర్మ తన బిడ్డ ఆరంగేట్రానికి ముందే ఇటీవల కొన్ని పనులను(ప్రకటనలు) ముగించుకుంటూ గత కొన్ని రోజులుగా ట్రెండీ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా అనుష్క నగరంలో పెండింగ్ షూట్లు పూర్తి చేస్తున్నప్పుడు.. విరాట్ కోహ్లీ తన టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. యోగాలో కోహ్లీ రక్షణ కల్పిస్తూ సహాయాన్ని అందించడం అందరినీ ఆకట్టుకుంది. అనుష్క తన యోగా గురువు అయిన భర్త సహాయం పర్యవేక్షణలో కష్టమైన యోగాసనం ప్రయత్నించానని వెల్లడించారు. ఈ అందమైన ఫోటో ని తన తల్లిదండ్రులకు అనుష్క షేర్ చేసింది. యోగా నా జీవితంలో ఒక పెద్ద భాగం కాబట్టి నేను అలాంటివన్నీ చేయగలనని నా డాక్టర్ సిఫారసు చేసారు.. నేను గర్భవతిగా ఉండటానికి ముందు నేను చేస్తున్న ఆసనాలు అన్నీ అటూ ఇటూ తిరిగేవి పూర్తిగా ముందుకు వంగి ఉండేవి చేసేదానిని. కానీ ఇప్పుడు సులువైన అసనాలే వేస్తున్నాను. అయితే తగిన సపోర్ట్ తీసుకునే చేస్తున్నాను. నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న శిర్శాసన కోసం గోడ సాయం తీసుకున్నాను. సమర్థుడైన నా భర్త అదనపు సమతుల్యతతో ఉండటానికి నాకు సహకరించారు. నా యోగా గురువు పర్యవేక్షణలో ఇదంతా. ఈ సెషన్ లో ఆయన నాతో వాస్తవంగా ఉన్నారు. గర్భం తో ఇలా అభ్యాసాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది`` అని అనుష్క వెల్లడించారు.ప్రస్తుతం అనుష్క ఇంట్లో సమయం గడుపుతుండగా విరాట్ ఆస్ట్రేలియాలో ఇండియా తరఫున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత త్వరలోనే ఆయన భారతదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు. అతను బిసిసిఐ నుండి కాబోయే డాడ్ గా సెలవు తీసుకున్నారు. అనుష్క బిడ్డకు జన్మనిచ్చేప్పుడు ఆ `అందమైన క్షణం` కోసం అక్కడ ఉండాలని తాను కోరుకుంటున్నానని విరాట్ ఈ సందర్భంగా చెప్పారు.
Please Share this article
Related:
Tagged with:
మొదలైన పవన్ కళ్యాణ్ రానా సినిమా రిమేక్
బాలీవుడ్ లోకి నాగ చైతన్య
సర్కారు వారి పాట యాక్షన్ మొదలైంది !
వైరల్ గ పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటో
ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్డేట్
వైరల్ గా మారిన జగపతి బాబు ట్వీట్
ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంగ్లీష్ సాంగ్ ఉండబోతుందట
అంజలిని చుస్తే షాక్ కావలిసిందే
శ్రుతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్
వరుణ్ తేజ్ పెళ్లికండిషన్స్ చెప్పిన నాగబాబు
అత్యంత వైభవంగా వరుణ్ – నటాశా వివాహం
గ్యాంగ్ లీడర్ రీ యూనియన్
రేంజ్‌రోవర్ కారు కొన్న హీరో నిఖిల్
అమ్మా నేను బతికున్నదే నీకోసం-నాగశౌర్య
సింగర్ సునీత-రామ్ వెడ్డింగ్ టీజర్ అదుర్స్
క్రాక్ ఆహాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా ?
Read More From This Category