మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడు. రీ ఎంట్రీ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఎప్పుడైతే సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాడో.. అప్పట్నుంచే మళ్లీ సినిమా ఫంక్షన్ లలో ఎక్కువగా మెగాస్టార్ కనిపించడం కూడా మొదలైంది. గత ఏడాది కాలంగా చిరు ఎక్కువగా ప్రేక్షకుల మధ్యలోనే ఉంటున్నారు. మెగా వేడుకలు ఏవి జరిగినా దానికి చిరంజీవే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.
రామ్ చరణ్, పవన్, సాయిధరంతేజ్, వరుణ్ తేజ్, బన్నీ.. ఇలా హీరోతో పనిలేదు మెగా ఫ్యామిలీ వాళ్లైతే చాలు అక్కడికి చిరు వాలిపోతున్నారు. ఆ మధ్య సర్దార్ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు చిరంజీవి. ఆ వేడుకలో అన్నాదమ్ముల మధ్య అనుబంధం చూసి అబ్బో అనుకున్నారంతా. ఆ తర్వాత సరైనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా చిరునే చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
ఇక ఇప్పుడు మరో రెండు మెగా వేడుకలు చిరు కోసం వేచి చూస్తున్నాయి. అదే శ్రీరస్తు శుభమస్తు ప్రీ రిలీజ్ ఈవెంట్.. తిక్క ఆడియో వేడుక. జులై 30న సాయిధరంతేజ్ తిక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ తర్వాతి రోజే శిరీష్ కోసం శ్రీరస్తు శుభమస్తుకు రాక తప్పదు. ఇటు మేనల్లుడు.. అటు కూడా మెయిన్ అల్లుడే
మెగా హీరోలతో పాటు సునీల్ లాంటి హీరోలు కూడా చిరంజీవినే నమ్ముకుంటున్నారు. మొత్తానికి మెగా హీరోల మధ్య చిరంజీవి కోసం ఇప్పుడు పెద్ద పోరాటమే జరుగుతుంది. పాపం.. ఎవ్వర్నీ కాదనలేక షూటింగ్ ఉన్నా కూడా బ్రేక్ చెప్పి మరీ తన వాళ్ల కోసం ఈవెంట్స్ కు వస్తున్నాడు మెగాస్టార్. మరి ఈ వాడకం ఎప్పుడు తగ్గుతుందో..?
నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.
http://www.facebook.com/andhravilasdotcom
htts://www.twitter.com/andhravilasnews
-B.S
Please Share this article
Related:
Tagged with: chiranjeevi pawan sai dharam varun tej banny
కేరళ కుట్టిని పెళ్లాడబోతున్న జస్ప్రీత్ బుమ్రా నిజమేనా ?
'దృశ్యం' సీక్వెల్ లో సమంత, రానా
‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
రంగ్ దే నుండి ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసింది
'వకీల్ సాబ్' మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి
ఏ1 ఎక్స్ ప్రెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్
సలార్' తో ప్రైమ్ రికార్డ్ బ్రేకింగ్ డీల్
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా
తల్లి కాబోతున్న గాయని శ్రేయా ఘోషాల్
మళ్ళీ లీకైన ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫోటోలు
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శర్వానంద్ శ్రీకారం
సమంతకు నో చెప్పిన ఈషా రెబ్బ ఎందుకో తెలుసా
నాని ‘వీ’ చిత్రంపై పరువునష్టం దావా వేసిన బాలీవుడ్ నటి
ప్రభాస్ ఆదిపురుష్ సెట్ దహనం వెనక కుట్ర ఉందా ?
రానా 'అరణ్య' ట్రైలర్ చూసారా
Read More From This Category