#PradeepMachiraju #30RojulloPreminchadamEla #Amrithaaiyer
యాంకర్ ప్రదీప్ హీరోగా సుకుమార్ శిష్యుడు మున్న తెరకెక్కించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా దాదాపు ఏడాది పాటు వాయిదా పడింది. ఇన్నాళ్లకు విడుదల అవుతుండటంతో ప్రదీప్ కూడా సంతోషంగా ఉన్నాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై సంచలనం సృష్టించిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గతంలో కూడా కొందరు యాంకర్లు హీరోలుగా మారారు. అయితే వాళ్లకు అదృష్టం కలిసి రాలేదు. కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. ఈయన సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. దానికి తోడు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. నీలి నీలి ఆకాశం పాట ఏకంగా 300 మిలియన్ మార్క్ అందుకుంది. దానికి తోడు మిగిలిన పాటలు కూడా అద్భుతమైన విజయం సాధించాయి. దాంతో ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని విధంగా జరుగుతుంది. ఈ సినిమాను చూసి గీతా ఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ను విడుదల చేస్తున్నాయి. ఇది కూడా అంచనాలు పెంచుతోంది.
ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మంచి బిజినెస్ చేసింది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా. ముఖ్యంగా తెలంగాణలో కోటిన్నరకు ఈ సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. మరోవైపు ఆంధ్రలో 2.1 కోట్లు.. సీడెడ్ హక్కులు 55 లక్షలకు అమ్ముడయ్యాయి. ఏపీ తెలంగాణలో ఈ సినిమా 4.3 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి మరో 30 లక్షల బిజినెస్ చేసింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..ప్రదీప్ సినిమా హిట్ కావాలి అంటే 5 కోట్ల షేర్ తీసుకురావాలి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 5 కోట్ల షేర్ రావడం పెద్ద విషయం కాదు. మరి ఈ టార్గెట్ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.
Please Share this article
Related:
Tagged with: 30
మరోసారి బీట్ సాంగ్ లో కేక పెట్టించనున్న సాయిపల్లవి, రివీల్ చేయబోతున్న సమంత
పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ
మార్చి 15న 'ఆర్ఆర్ఆర్' అప్డేట్
ఉప్పెన దర్శకుడి తర్వాత సినిమా హీరో ఎవరో తెలుసా?
ఉప్పెన' మేకింగ్ వీడియో చూసారా
నాంది హింది రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత
‘నాంది’ 6 డేస్ కలెక్షన్ రిపోర్ట్
ఉప్పెన 13 రోజుల కలెక్షన్ రిపోర్ట్
‘ఉప్పెన’ సినిమాకు వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
విష్ణు మోసగాళ్లు ట్రైలర్
సమంత శాకుంతలం షురూ అయ్యేది ఎప్పుడో తెలుసా ?
విరాటపర్వం నుండి 'కోలు కోలమ్మా కోలో' సాంగ్
సుకుమార్ కూతురి వేడుకలో మెరిసిన తారలు
వైరల్‌గా మారిన చిరంజీవి, రామ్ చరణ్ ఫొటోస్
క్రిష్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ ఎప్పుడు అంటే ?
రాధే శ్యామ్ Vs గంగూభాయ్ కతియావాడి
Read More From This Category