ఈకోలీ అనే బ్యాక్టీరియా ఫుడ్పాయిజనింగ్కి కారణమవుతుంది. నీళ్లను రాగిబిందెల్లో నిల్వ చేసినప్పుడు ఈ బ్యాక్టీరియా చనిపోతుంది. రాగి నీళ్లను పరిశుభ్రం చేస్తుంది. క్రిములతో పోరాడుతుంది. అందుకే చాలా అధ్యయనాలు గదుల్లో ఏదో ఒక వస్తువుని రాగితో చేయించి పెట్టుకోమని సూచిస్తున్నాయి. అలా ఉన్నా క్రిములతో పోరాడుతుందీ లోహం. * రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. అరుగుదల సక్రమంగా ఉంటుంది. రాగి బిందెలో నీళ్లు బరువు తగ్గడానికి దోహదపడతాయి. శరీరంలో నిల్వ ఉన్న హానికారక కొవ్వులకు ఈ లోహం పెద్దశత్రువు మరి! * రాగిలో ఉండే పలు రకాల పోషకాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ, ఏకాగ్రత చాలా బాగుంటాయి. చదువుకునే చిన్నారులకు ఈ నీళ్లు ఇవ్వడం ఎంతో మంచిది. * ఇది యాంటీ ఏజింగ్ కారకం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో రాగి కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించి.. కొత్త వాటిని పునర్నిర్మించడానికి తోడ్పడుతుంది. * ఈ లోహంతో చేసిన బిందెలో నీళ్లు తాగడం వల్ల ఎముకలు దృఢపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల సంబంధ సమస్యలున్నవారు తాగితే ఉపశమనంగా ఉంటుంది. * రాగి పాత్రల్లో నీళ్లను క్రమం తప్పకుండా తాగితే రక్తపోటు అదుపులోకి వస్తుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా రాగి బిందెలో నీళ్లు తీసుకుంటే ఎంతో మంచిది. * శరీరంలో రాగి లోపిస్తే... థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. దీన్ని అధిగమించాలంటే రాగి చెంబులో నీళ్లు తాగాలి. థైరాయిడ్ గ్రంథులు కూడా ఉత్తేజితమై సమస్యలు దరిచేరవు.
Please Share this article
Related:
Tagged with: 12reasonsdrinkingwaterincoppervessel1929720
రాగి పాత్రలోని నీళ్లు తాగండి
అమ్మాయులు ఉప్పు తగ్గించాలి
అల్బకర తో అందంగా..
వ్యాయామాలకు ఏ టైం మంచిది?
కడుపుబ్బరం తగ్గటానికి కి చిట్కాలు
గ్రీన్ టీ తాగితే గుండెనొప్పి దూరం
సోయాతో చక్కని ఆరోగ్యం
హైపర్టెన్షన్ నియంత్రణకు ఆహార నియమాలు అవసరం
నిమ్మకాయ సుగుణాలు
బొప్పాయి పండు తింటే
చిట్కాలు - 4
చిట్కాలు - 3
చిట్కాలు - 2
తిండి తగ్గిస్తే ఏమవుతుంది?
సూపర్ హెల్త్ కి చిట్కాలు
ఆలస్యంగా లేస్తే.. అంతేమరి..!
Read More From This Category