శాతకర్ణి, శాతా వా హనులు గురిం చి ఆసక్తి ఉం డేది. ఎప్పుడైతే క్రిష్ గౌత మిపుత్ర శాతకర్ణి సినిమా చేద్దామని అన్నారో నేను కూడా శాతకర్ణి గురించి స్టడీ చేయడం మొదలు పెట్టాను. 'కృష్ణం వందే జగద్గురమ్' సినిమా తర్వాతే క్రిష్‌కి శాతకర్ణి సినిమా గురించిన ఆలోచన వచ్చింది. అప్పటి నుండి స్టడీ చేయడం మొదలు పెట్టారు. మధ్యలో 'కంచె' సినిమా తీశారు. ఆ తర్వాత హిందీ 'గబ్బర్' సినిమాలను చేస్తూనే ఈ సినిమా గురించి వివరాలు సేకరించారు.స్నేహితులు పుస్తకాలు ఇచ్చారుదీని గురించి వివిధ పుస్తకాలు సేకరించాం. దాని నుండి వివరాలు రాబట్టాం. శాతకర్ణి గురించి ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే. క్రిష్ నాసిక్ శాసనాలు, యూనివర్సిటీ పుస్తకాలు, యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖలు చదివినప్పుడు అప్పటి సంస్కృతిని తెలుసుకున్నాం. నేను కూడా తెనాలిలోని గ్రంథాలయానికి వెళ్ళి వెతికాను. అన్నిటికంటే నా స్నేహితులు ఇచ్చిన కొన్ని పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి.ఆ అవకాశం అందరికీ రాదుతెనాలి రామకృష్ణుడు, చాణక్య చంద్రగుప్తుడు ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి సినిమాలకు పనిచేయాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ అవకాశం రాదు. నాకు అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం పట్టలేదు. కానీ లొకేషన్స్ అనుసరించి చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి. సన్నివేశాలను కథ ప్రకారం ఎన్హాన్స్ చేసుంటూ వెళ్లడమే. డైలాగ్స్‌కు ఇంత మంచి స్పందన రావడం చాలా హ్యాపీగా ఉంది.ముందు భయపడ్డానుబాలకష్ణ నా ఎదురుగా కూర్చొని ఉన్నారు. మన డైలాగ్స్ నచ్చుతా యో లేదో, ఏమంటారోనని ఫస్ట్ రోజు భయపడ్డాను. కానీ ఆయన డైలాగ్స్ చదవగానే చాలా బావున్నాయని అన్నారు.గొప్పగా అనిపిస్తుంది'ఖైదీ నంబర్ 150' సినిమాకు కూడా కొన్ని డైలాగ్స్ నేను రాశాను. ఇప్పుడు రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రెస్టీజియస్ మూవీస్ కావడం ఇంకా గొప్పగా ఉంది.సరైన తెలుగు తెలీదుఅప్పటి తెలుగు ఎవరికీ తెలియదు. పాతికేళ్ల క్రితం ఉన్న తెలుగులో మాట్లాడితేనే ఎవరికీ అర్థం కాదు. అలాంటి మొదటి శతాబ్దంలో భాషను ఎలా వాడుతాం. కాబట్టి అందమైన తెలుగును, అందరికీ అర్థమయ్యే తెలుగులోనే సంభాషణలు రాశాను. మేం చెప్పిన కథ ఇదేఅప్పట్లో భారతదేశం చిన్న చిన్న గణ రాజ్యాలుగా ఉండేవి. ఇలాంటి గణ రాజ్యాలను కలిపి ఒక దేశంగా ఎలా చేశాడనేదే గౌతమిపుత్ర శాతకర్ణి. సినిమా అంతా ఒక జర్నీలా ఉంటుంది. దేశమంతటినీ జయిస్తూ రావడం వల్ల 'త్రి సముద్ర తోయ పాన వాహన' అనే బిరుదు కూడా ఉండేది. అంటే ఆయన గుర్రాలు మూడు సముద్రాల నీటిని తాగాయని అర్థం. అటువంటి గుర్రాలను అధిరోహించి యుద్ధం చేసిన వాడని అర్థం. చరిత్ర ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణికి ఓటమనేదే లేదు. ఆయన మరణం కూడా సహజ మరణమే. అయితే సినిమాలో ఆయన దేశాన్ని ఎలా ఏకం చేశాడనే విజయగాథను చూపించాం.
Please Share this article
Related:
Tagged with: krishshatakarni
ఊరంతా ఏమనుకుంటున్నారు?- శ్రీనివాస్ అవసరాల
చరణ్ చేయకపోతే నేనే చేస్తా - వరుణ్ తేజ్
అందుకే నెగెటివ్ పాత్రల్ని పక్కనపెట్టా
స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా-లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
సంపూర్నేష్‌బాబు ఇంటర్వ్యూ
శృతిహాసన్ పవన్ కళ్యాణ్ జోడి బాగాలేదా ? డాలీ ఇంటర్వ్యూ
ఎన్ని సినిమాలైనా ఆడతాయి-శర్వానంద్ ముచ్చట్లు
ఏడాదిలోపే సిక్స్ ప్యాక్ -చిరంజీవి ఇంటర్వ్యూ హైలైట్స్
ఎక్కువగా స్టడీ చేసింది క్రిష్ మాత్రమే
అదే జనాలను కూర్చోపెడుతుంది-చరణ్ ఇంటర్వ్యూ
విలన్‌గా నటించాలనే నా కోరిక తీరిపోయింది
నా దగ్గర పదేండ్లకు సరిపడా స్క్రిప్టులున్నాయి-పూరీ ఇంటర్వ్యూ
త్వరలోనే నిర్మాతగా
మెచ్చ్యూరిటీ పెరిగిందిరామ్ ఇంటర్వ్యూ
డేంజర్ నుంచి బయటపడ్డా-నాని
Read More From This Category